రూ.18 కోట్లు నాకు చాలా తక్కువ ఢిల్లీ క్యాపిటల్స్ కు పంత్ షాక్

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు గడువు దగ్గర పడుతున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ప్లేయర్స్ ఫ్రాంచైజీలను భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిటెన్షన్ ప్రాధాన్యత విషయంలో ఫ్రాంచైజీ ప్లాన్స్ ను వారు అంగీకరించడం లేదు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2024 | 05:36 PMLast Updated on: Oct 25, 2024 | 5:36 PM

Rs 18 Crore Is Too Little For Me Pant Shocks Delhi Capitals

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు గడువు దగ్గర పడుతున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ప్లేయర్స్ ఫ్రాంచైజీలను భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిటెన్షన్ ప్రాధాన్యత విషయంలో ఫ్రాంచైజీ ప్లాన్స్ ను వారు అంగీకరించడం లేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆ ఫ్రాంచైజీ ఓనర్లకు షాకిచ్చాడు. రిటెన్షన్ లో భాగంగా పంత్ ను మొదటి ప్రాధాన్యతగా తీసుకున్న ఢిల్లీ 18 కోట్లతో కొనసాగించుకోనుంది. అయితే 18 కోట్లు తనకు చాలా తక్కువగా ఉందని పంత్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇంకా ఎక్కువ మొత్తం అతను డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ప్రకారం రి
టైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. రిటెన్షన్ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అయితే ఈ నిబంధనలు ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారాయి.

తాజాగా పంత్ తన రిటెన్షన్ మొత్తం విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో పంత్ కు చెడిందన్న వార్తలు కూడా ఇటీవలే వచ్చాయి. కెప్టెన్ గా అతని స్థానంలో అక్షర్ పటేల్ ను ఢిల్లీ నియమిస్తుందని వార్తలు వినిపిస్తుండడమే దీనికి కారణం. అదే సమయంలో ఇటీవల పంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. తాను వేలంలోకి వస్తే ఎంత ధర పలుకుతానంటూ పంత్ ఫ్యాన్స్ ను అడుగుతూ పోస్ట్ పెట్టాడు. కొందరు రిషబ్ పంత్ రూ.18 కోట్ల కంటే ఎక్కువకి అమ్ముడుపోతాడని రిప్లై ఇవ్వగా.. మరికొందరు రూ.30 కోట్ల వరకు ధర పలుకుతావంటూ సమాధానం ఇచ్చారు. ఇంకొందరు తాగేసి పోస్ట్ చేసావా అంటూ సెటైర్లు వేశారు. ఆ తర్వాత రిటైన్ జాబితాలో తన పేరు ఉన్నప్పటకీ వేలంలోకి వెళ్ళేందుకే పంత్ రెడీ అవుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఫ్రాంచైజీకే నేరుగా రిటెన్షన్ మొత్తం విషయంలో పంత్ తన డిమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పంత్ ఎంత మేర డిమాండ్ చేస్తున్నాడన్నది తెలియకున్నా… 18 కోట్లు మొత్తం మాత్రం తనకు చాలా తక్కువనే చెప్పినట్టు సమాచారం. బీసీసీఐ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ ఇచ్చే అవకాశాన్ని ఫ్రాంచైజీలకే వదిలేసినా జట్టును కొనుగోలు చేసే క్రమంలో ప్రతీ రూపాయి కూడా విలువనైదే…ఒకవేళ ఒక ప్లేయర్ కే భారీ మొత్తం పెడితే జట్టు కూర్పు సరిగా కుదరకపోవచ్చు. అందుకే ప్రతీ ప్లేయర్ ను కొనే విషయంలో ఫ్రాంచైజీలు ఈ సారి వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఖాయం. ఎందుకంటే రిటైన్ చేసుకునే ప్లేయర్స్ కోసమే ఫ్రాంచైజీల 120 కోట్ల పర్స్ వాల్యూలో సగానికి పైగా ఖర్చు అవుతోంది. దీంతో మిగిలిన 20 మందిని మిగతా సగం మొత్తంతోనే కొనాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో పంత్ డిమాండ్ కు ఢిల్లీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.