RETIRED SCAM : రూ.1800 కోట్లు కొట్టేశారా ? రిటైర్డ్ అయినా పదవుల్లోనే 1049మంది
తెలంగాణలో (Telangana Govt) త్వరలో అతిపెద్ద భారీ స్కామ్ (Biggest Scam) బయటపడబోతోంది. బీఆర్ఎస్ హయాంలో (BRS Govt) నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులను (Retired employees) ఏరివేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి లిస్ట్ ను తెప్పించుకున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి వెయ్యి 49 మంది రిటైర్డ్ ఉద్యోగులు కొనసాగుతున్నట్టు తేలింది.
తెలంగాణలో (Telangana Govt) త్వరలో అతిపెద్ద భారీ స్కామ్ (Biggest Scam) బయటపడబోతోంది. బీఆర్ఎస్ హయాంలో (BRS Govt) నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులను (Retired employees) ఏరివేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి లిస్ట్ ను తెప్పించుకున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి వెయ్యి 49 మంది రిటైర్డ్ ఉద్యోగులు కొనసాగుతున్నట్టు తేలింది. వీళ్ళ జీత భత్యాల కోసం ఏడాదికి 18 వందల కోట్లను ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. వీళ్ళల్లో అసలు నిజంగా ఉద్యోగాలు చేస్తున్నది ఎంతమంది.. కొలువులు చేయకుండా ఇంట్లో కూర్చున్నవాళ్ళు ఎంతమంది.. అన్నది తేలాలి. అలాగే పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా.. ఏ కారణాలతో రిటైర్డ్ వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారన్నదానిపై లెక్కలు తీస్తున్నారు సీఎ రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ హయాంలో కాస్త పలుకుబడి ఉంటే చాలు.. రిటైర్డ్ అయ్యి.. వృద్దాప్యం మీద పడుతున్నా అదే ఉద్యోగంలో దర్జాగా కంటిన్యూ అవ్వొచ్చు. వడ్డించేవాడు మనోడేగా అన్నట్టుగా.. రిటైర్మెంట్ కంటే ముందే ఎక్స్ టెన్షన్ తెచ్చుకుంటూ కంటిన్యూ అవుతున్నారు వెయ్యి మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు. ఇలాంటి వాళ్ళందర్నీ ఏరి పారేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నిశాఖలకు సీఎస్ శాంతకుమారి (CS Shanthakumari) లెటర్లు రాయడంతో HODల నుంచి జాబితాలు సెక్రటరియేట్ కు చేరాయి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం మొత్తమ్మీద వెయ్యి 49 మంది నియామకం అయినట్టు బయటపడింది. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 179 మంది రిటైర్డ్ బ్యాచ్ పనిచేస్తున్నారు. ఈ శాఖ కేటీఆర్ హయాంలోనే ఉంది. ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖలో 88 మంది, ఆర్ అండ్ బీలో 81 మంది రిటైర్డ్ ఉద్యోగులు, పౌరసరఫరాల శాఖలో 75, నీటిపారుదల శాఖలో 70 మంది ఇలా కంటిన్యూ అవుతున్నారు.
ఈ వెయ్యి 49 మంది రిటైర్డ్ బ్యాచ్ జీత భత్యాలకు నెలకు 150 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చవుతున్నాయి. అంటే ఏడాదికి 1800 కోట్ల రూపాయలు. రిటైర్డ్ అయిన అధికారులకు మళ్ళీ ఎందుకు అవకాశం ఇవ్వాలి.. ఆ పోస్టుకు నిజంగా అర్హులు లేరా.. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు పనిచసే సామర్థ్యం లేదా అంటే.. అదేం లేదు.. వాళ్ళకి పలుకుబడి ఉంది.. ఎక్స్ టెన్షన్ తెచ్చుకున్నారు.. కంటిన్యూ అవుతున్నారు. నిజంగా ఇలా రిటైర్డ్ అయ్యి కూడా వాళ్ళ అవసరం ఉంది అనుకున్న శాఖలు చూస్తే.. ఉన్నత విద్యామండలి, నీటిపారుదల శాఖలో పనిచేసే ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే. మిగతా శాఖల్లో ఈ రిటైర్డ్ బ్యాచ్ అదే పదవుల్లో కంటిన్యూ అవడం వల్ల వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లకు ప్రమోషన్లు రావట్లేదు. కొందరు ఉద్యోగులైతే ప్రమోషన్లు రాకుండానే రిటైర్డ్ అయిపోతున్నారు. దాంతో వాళ్ళకు రావల్సిన జీతాలు, అలెవెన్సులు, రిటైర్డ్ అయ్యాక ఫించన్ ఇలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.
రిటైర్డ్ అయి మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళల్లో అందరూ నిజంగా పని చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. మొన్నీ మధ్య విద్యుత్ శాఖలో డైరెక్ట్ గా అపాయింట్ అయిన ఓ ఉద్యోగి అసలు ఆఫీసుకు రాకుండానే.. ఏడాదికి లక్షల్లో జీతం తీసుకున్నట్టు బయటపడింది. ఆ ఉద్యోగి మంత్రి బంధువు అని తేలింది. ఇలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో ఎంతమంది నిజంగా డ్యూటీ చేస్తున్నారు. ఎంతమంది ఇంట్లో కూర్చొని జీతాలు డ్రా చేస్తున్నారో కూడా సీఎం రేవంత్ రెడ్డి తేల్చాల్సి ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల దందాపై నిరుద్యోగులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ వల్ల తమకు రావల్సిన ఉద్యోగాలు కూడా రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయినా.. రిటైర్డ్ అయి పదవుల్లో కొనసాగుతున్న వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.