రూ. 4 లక్షలు ఖర్చు పెట్టి కారుకు అంత్యక్రియలు
సొసైటీలో అంత్యక్రియలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైనా మనుషులు చనిపోతే వాళ్లకు ఎంతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. వాళ్లతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
సొసైటీలో అంత్యక్రియలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైనా మనుషులు చనిపోతే వాళ్లకు ఎంతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. వాళ్లతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ల జ్ఞాపంగా సమాధులు నిర్మిస్తారు, కొందరు విగ్రహాలు కూడా పెడతారు. మనుషులకే కాదు.. చాలా మంది పెంపుడు జంతువులకు కూడా ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఓ వస్తువుకు.. అది కూడా ఓ కారు అంత్యక్రియలు నిర్వహించడం గురించి ఎప్పుడైనా విన్నారా. అలా ఎవరూ చేయరు అనకుంటున్నారేమో.. ఓ వ్యక్తి మాత్రం తాను ఎంతో ప్రమతో కొనక్కున్న కారుకు అంత్యక్రియలు నిర్వహించాడు.
వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజం. 12 ఏళ్లుగా వాడుతున్న మారుతీసుజుకి వ్యాగన్ ఆర్ వాహనానికి సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించింది గుజరాత్‌లోని ఓ కుటుంబం. బంధుమిత్రులందర్నీ పిలిచి.. తమ పొలంలోనే గుంత తీసి అందులోకి కారును డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లి.. ఆ తర్వాత అంత్యక్రియలను పూర్తి చేసింది. దాదాపు 4 లక్షలు ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టింది. గుజరాత్ పదర్షింగా గ్రామంలో నివసించే సంజయ్ పోలారా కుటుంబం 12 ఏళ్ల క్రితం వ్యాగన్ ఆర్ కారు కొన్నారు. ఆ కారు కొన్నాక వాళ్ల జీవితంలో చాలా కలిసొచ్చిందట. దీంతో దాన్ని తమ లక్కీ కారుగా భావిస్తూ వచ్చింది ఆ ఫ్యామిలీ. జీవితంలో ఎదిగే కొద్దీ కొత్త కొత్త వాహనాలు తీసుకున్నా.. ఆ కారను మాత్రం అపురూపంగా చూసుకున్నారు. రీసెంట్‌గా ఆ కారు పూర్తిగా పావడంతో దానికి కృతజ్ఞతగా ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. భవిష్యత్ తరాలకు ఈ విషయం గుర్తుండాలని కారుకు సమాధి కూడా నిర్మించారు. మనుషుల్ని పెంపుడు జంతువుల్ని ప్రేమించడం చూశా కానీ వస్తువుల్ని కూడా ఇంతలా ప్రేమించేవాళ్లు ఉంటారా అని షాకవుతున్నారు ఈ విషయం విన్నవాళ్లు.