MLC Kavita : తీమార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ములాఖాత్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకలు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితతో ములాఖత్ అయ్యారు.

RS Praveen Kumar, Balka Suman Mulakat with MLC Kavita in Teemar Jail
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకలు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితతో ములాఖత్ అయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాగా, గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనిలాండరింగ్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ రౌస్ ఎవెన్సూ కోర్టు ఆమెకు జుడీషియన్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత జైలులో ఉన్న సమయంలోనే కవితను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ రెండు కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు కవిత. పలుసార్లు బెయిల్ పిటిషన్ వేసిన కోర్టు కొట్టివేసింది. ఈక్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24 కవిత బెయిల్ పిటిషన్ పై విచారించనుంది.