RTMలతో పర్స్ ఖాళీ, ఫ్రాంచైజీలకు టెన్షన్..టెన్షన్

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ఫ్రాంచైజీలకు దడ పుట్టించింది. ఆ ఆప్షన్ తో పలు ఫ్రాంచైజీల పర్స్ ఖాళీ అయింది. నిజానికి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడానికి కారణం ఆర్టీఎం ఆప్షనే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2024 | 02:25 PMLast Updated on: Nov 26, 2024 | 2:25 PM

Rtms Empty Purses Franchises Tense Tension

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ఫ్రాంచైజీలకు దడ పుట్టించింది. ఆ ఆప్షన్ తో పలు ఫ్రాంచైజీల పర్స్ ఖాళీ అయింది. నిజానికి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడానికి కారణం ఆర్టీఎం ఆప్షనే.. గతంతో ఉన్న ఆర్‌టీఎమ్ నిబంధనలతో ఫ్రాంచైజీలకు పర్స్‌కు అంత దెబ్బపడేది కాదు. కానీ కొత్త నిబంధనలతో గరిష్ఠ బిడ్‌ను వేయాల్సి వస్తుంది. ఫలితంగా ఫ్రాంచైజీ మిగులు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తొలిరోజు వేలంలో అర్షదీప్ సింగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ 15.75 కోట్లు వెచ్చించడానికి సిద్ధమై తొలుత దక్కించుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్‌టీఎమ్ అస్త్రాన్ని ఉపయోగించింది. దీంతో సన్ రైజర్స్ 18 కోట్లు ఫైనల్ బిడ్‌గా వేసింది. దీంతో అర్షదీప్ ను వదులుకోవడం ఇష్టం లేని పంజాబ్ ఆ మొత్తాన్ని చెల్లించి అతన్ని దక్కించుకుంది. ఇక పంత్ ఆల్‌టైమ్ రికార్డు ధర పలకడానికి ఆర్‌టీఎమ్ నిబంధనే కారణం. పంత్‌ కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి లక్నో సూపర్ జెయింట్స్ 20.75 కోట్లు వెచ్చిస్తూ పైచేయి సాధించింది.

కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగిస్తామని చెప్పడంతో.. లక్నో పంత్ కోసం 27 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. దీంతో ఢిల్లీ వెనకడుగు వేసింది. లక్నో దక్కించుకున్నప్పటికీ అదనంగా 6.25 కోట్లు వెచ్చించింది. అలాగే జితేశ్ శర్మను 7 కోట్లకు దక్కించుకోవాల్సిన ఆర్సీబీ.. పంజాబ్ ఆర్‌టీఎమ్ కార్డు వినియోగిస్తానని ముందుకు రావడంతో బెంగళూరు ఫ్రాంచైజీ 11 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. రసిక్ దర్ విషయంలోనూ ఆర్సీబీ ఆర్‌టీఎమ్ వల్ల ఎక్కువ మొత్తం కోల్పోయింది. 2 కోట్లకు బదులుగా 6 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. మరోవైపు వేలంలో నమన్ ధిర్‌ను రాజస్థాన్ రాయల్స్ 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ముంబై ఇండియన్స్ ఆర్‌టీఎమ్‌తో ముందుకు రావడంతో రాజస్థాన్.. నమన్ కోసం బిడ్‌ను 5.25 కోట్లకు పెంచింది. ఆ మొత్తాన్ని ముంబై చెల్లించి నమన్ ధిర్‌ను తీసుకుంది. రెండోరోజు వేలంలో కూడా RTM రూల్ ఫ్రాంచైజీల మనీ పర్స్ పై తీవ్ర ప్రభావమే చూపించింది. ముఖేశ్ కుమార్ కోసం హోరాహోరీ బిడ్డింగ్ జరగ్గా పంజాబ్ అతన్ని తీసుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించింది. అయితే ముఖేష్ కుమార్ ను RTM కింద ఢిల్లీ క్యాపిటల్స్ 8 కోట్లకు దక్కించుకుంది. ఒకవిధంగా ఆర్టీఎం ఆప్షన్ నిబంధన ఫ్రాంచైజీలకు టెన్షన్ పుట్టిస్తే… ఆటగాళ్ళకు మాత్రం కోట్లు తెచ్చిపెట్టింది.