Ram Charan: చరణ్ విషయంలో.. నోరు విప్పరా..?
యూఎస్ లో లియో రిలీజ్అయ్యే ఛాలా థియేటర్స్ లో రామ్ చరణ్ పేరు కనిపిస్తోంది. టోటల్ కాస్ట్ అండ్ క్రూ లిస్ట్ లో విజయ్ దళపతి, త్రిష తోపాటు రామ్ చరణ్ పేరు ని కూడా పోస్టర్స్ లో అక్కడ చూపిస్తున్నారు.

Rumors of Ram Charan guesting in Vijay Dalapathy's Leo movie are doing rounds every week.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఎమోషనల్ సీన్స్ షూటింగ్స్ తో బిజీ అయ్యాడు. కొత్త షెడ్యూల్ లో పాటల్ని తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో లియో మూవీ లో చరణ్ గెస్ట్ అన్న పుకార్లు, వారానికోరకంగా మారుతున్నాయి. మెగా పవర్ స్టార్ లియోలో గెస్ట్ గా నటించలేదని చెర్రీ టీం తేల్చింది.
అయినా యూఎస్ లో లియో రిలీజ్అయ్యే ఛాలా థియేటర్స్ లో రామ్ చరణ్ పేరు కనిపిస్తోంది. టోటల్ కాస్ట్ అండ్ క్రూ లిస్ట్ లో విజయ్ దళపతి, త్రిష తోపాటు రామ్ చరణ్ పేరు ని కూడా పోస్టర్స్ లో అక్కడ చూపిస్తున్నారు.. అయినా చరణ్ టీం మాత్రం లియోలో మెగా పవర్ స్టార్ గెస్ట్ రోల్ నిజం కాదని తేల్చేసింది.
ఇంత జరుగుతోంది. రెండు వారాలుగా ఈ పుకార్ల జోరు పెరిగింది. చెర్రీ టీం ఖండించింది. ఐనా లోకేష్ కనకరాజ్ కాని, లియో మూవీ తాలూకు మిగతా టీం కాని ఖండించలేదు. పుకార్లను సపోర్ట్ చేయట్లేదు. అసలు నోరే మెదపట్లేదు..ఎందుకు?
అక్కడే చిక్కొచ్చింది. లియో మూవీలో రామ్ చరణ్ నటించలేదు. కాని తెలుగు వర్షన్ ని తను వాయిస్ ఓవర్ చెప్పాడు అందుకే తన పేరుని కాస్ట్ అండ్ క్రూలిస్ట్ లో పెట్టారని కొత్తగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే అదే నిజమైతే, ఆ సంగతైనా తేల్చాలి కదా.. సినిమా ప్రమోషన్ కి కూడా పనికొస్తుంది..కాని అలా కూడా చేయట్లేదు లియోటీం. ఐతే లోకేష్ కనకరాజ్ తో చరన్ మూవీ ఎప్పుడో కమిటయ్యాడు. కాకపోతే 2026 లోనే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. కాబట్టే లోకేష్ ఇప్పడు చరణ్ తాలూకు పుకార్లేవి వచ్చినా సినిమాకు పబ్లిసిటీగా పనికొస్తుందనే లైట్ తీసుకుంటున్నాడని చర్చ కూడా జరుగుతోంది.