Garry Kasparov: ఉగ్రవాదుల జాబితాలో చెస్ లెజెండ్.. గ్యారీని టెర్రరిస్టు జాబితాలో చేర్చిన రష్యా

పుతిన్‌ వైఖరిని విమర్శించినా, వ్యతిరేకించినా.. వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. వారిపై ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. తాజాగా గ్యారీ కాస్పరోవ్‌‌పై కూడా చైనా ప్రభుత్వం ఇదే చర్య తీసుకుంది. ఆయనను ఉగ్రవాదులు, అతివాదులు’ జాబితాలో చేర్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2024 | 05:28 PMLast Updated on: Mar 07, 2024 | 5:28 PM

Russia Adds Chess Legend Garry Kasparov To Terrorist And Extremist List

Garry Kasparov: గ్యారీ కాస్పరోవ్‌.. చెస్ ఆట గురించి తెలిసిన వారికి ఈ లెజెండ్ గురించి తెలియకుండా ఉండదు. రష్యాకు చెందిన ఈ చెస్ లెజెండరీ ఆటగాడిని ఇప్పుడు ఉగ్రవాదులు, అతివాదుల జాబితాలో చేర్చింది రష్యా ప్రభుత్వం. ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న పుతిన్.. నియంతృత్వ పోకడల గురించి తెలిసిందే. ఆయనకు ఎదురెళ్లిన వాళ్లెవరూ అక్కడ స్వేచ్ఛగా జీవించే పరిస్థితులుండవు. కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదమే. పుతిన్‌ వైఖరిని విమర్శించినా, వ్యతిరేకించినా.. వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. వారిపై ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. తాజాగా గ్యారీ కాస్పరోవ్‌‌పై కూడా చైనా ప్రభుత్వం ఇదే చర్య తీసుకుంది.

AP VOLUNTEERS: ఓట్ల రాజకీయం.. ఏపీలో వాలంటీర్లను పీకేస్తారా ?

ఆయనను ఉగ్రవాదులు, అతివాదులు’ జాబితాలో చేర్చింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్‌ చెస్‌లో కీర్తి శిఖరాలు అందుకున్నారు. అనేకసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. అయితే, ఆయన ఆటకే పరిమితం కాలేదు. రాజకీయంగా కూడా తన అభిప్రాయాలను బలంగా వినిపిస్తుంటారు. రష్యాలో పుతిన్‌ అనుసరిస్తున్న విధానాలను నిర్ద్వందంగా ఎండగడుతుంటారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను ఖండించారు. అనేక అంశాల్లోనూ పుతిన్‌ను విమర్శించారు. దీంతో రోస్‌ఫిన్‌ మానిటరింగ్‌ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ).. గ్యారీ కాస్పరోవ్‌ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. కొత్త జాబితా ఈ రోజే విడుదలైంది. ఇందులో గ్యారీ పేరుండటం షాకింగ్‌కు గురి చేసింది. అయితే, ఆయన పేరును ఉగ్రవాదులు, అతివాదుల జాబితాలో చేర్చేందుకు దారితీసిన కారణాలను మాత్రం వివరించలేదు. ఈ జాబితాలో చేరితే పలు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటివాళ్ల బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు ఉంటాయి. వారి ఖాతాలను వినియోగించాలనుకున్న ప్రతిసారి అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం గ్యారీ కాస్పరోవ్.. రష్యాలో ఉండటం లేదు. ప్రభుత్వ అణచివేతకు భయపడి 2014లోనే ఆయన దేశం విడిచివెళ్లిపోయారు. కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో చాలా కాలం నుంచే ఆయనపై రష్యా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2022లో రష్యా న్యాయశాఖ గ్యారీ కాస్పరోవ్‌పై విదేశీ ఏజెంట్‌ అనే ముద్ర వేసింది. తాజాగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయితే, కాస్పరోవ్‌పై రష్యా తీసుకున్న చర్యలను అక్కడి మానవ హక్కుల సంఘాలు ఖండిస్తున్నాయి. ప్రత్యర్థుల అణచివేతకు ఈ ఆంక్షలను పుతిన్ ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. పుతిన్‌కు ఎదురుతిరిగిన వాళ్లు వరుసగా వివిధ కారణాలతో మరణిస్తున్న సంగతి తెలిసిందే. జైలులో ఉన్న ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇటీవలే మరణించారు. ఆయన మృతి పలు అనుమానాలను తావిచ్చింది. అంతకుముందు ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు.