గుకేశ్ ప్రత్యర్థి కావాలనే ఓడాడు విషం కక్కుతున్న రష్యా
ప్రపంచ చదరంగంలో భారత్ ఆధిపత్యాన్ని రష్యా సహించలేకపోతోంది. అందుకే రష్యా చెస్ ఫెడరేషన్ కొత్త ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజుపై విషం కక్కుతోంది. భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచాడు.
ప్రపంచ చదరంగంలో భారత్ ఆధిపత్యాన్ని రష్యా సహించలేకపోతోంది. అందుకే రష్యా చెస్ ఫెడరేషన్ కొత్త ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజుపై విషం కక్కుతోంది. భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో చైనా దిగ్గజం డింగ్ లిరెన్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచాడు. 18 ఏళ్లకే ఈ ఘనత సాధించి.. అతి పిన్నవయస్కుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. హోరాహోరీగా సాగిన 14వ రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను చిత్తు చేశాడు. 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురిస్తోంది. సి. అయితే.. రష్యా చెస్ ఫెడరేషన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. గుకేశ్ తన ప్రతిభతో గెలవలేదని, లిరెన్ కావాలనే ఓడిపోయాడని వ్యాఖ్యానించింది.
గుకేశ్ విజేత నిలిచిన తరువాత రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ పనికిమాలిన ఆరోపణలు చేశాడు. ఈ మ్యాచ్ ఫలితం చెస్ అభిమానులు, నిపుణులను ఆశ్చర్యపరిచిందన్నాడు.హోరాహోరీగా పోరు సాగినప్పటికి చైనా ఆటగాడి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నాడు. మ్యాచ్‌లో లీరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోవడం అసంభవం అని చెప్పాడు. అతడు కావాలనే తప్పులు చేసినట్లుగా కనిపిస్తుందన్నాడు. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ఫిడే విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉంటే 14వ రౌండ్ నాలుగు గంటల పాటు సాగింది. మొత్తం 58 ఎత్తుల్లో మ్యాచ్ పూర్తయింది. అయితే.. 55వ ఎత్తులో లిరెన్ ఓ తప్పిదాన్ని చేశాడు. ఏనుగు కదిపాడు. ఇది గుకేశ్‌కు కలిసి వచ్చింది. వెంటనే ఆ ఏనుగును తన ఏనుగుతో గుకేశ్ చంపేశాడు. ఆ తరువాత మ్యాచ్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు.
అయితే రష్యా చెస్ ఫెడరేషన్ ఆరోపణలపై నెటిజన్లు, భారత్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత్ విజయాన్ని రష్యా జీర్ణించుకోలేకపోతోందని కౌంటర్ ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే గుకేశ్ పై విషం చిమ్ముతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. చెస్ లో తమ ఆధిపత్యం తగ్గిపోవడం రష్యాకు మింగుడుపడడం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.