China, Russia : చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. వణికిపోతున్న అగ్రదేశం అమెరికా
రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఈ వారంలో చైనాలో రెండు రోజుల పర్యటన చేయనున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఈ వారంలో చైనాలో రెండు రోజుల పర్యటన చేయనున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ సందర్భంగారెండు రోజులపాటు అక్కడే కీలక సమావేశాల్లో మాట్లాడి, చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇటీవలే రష్యా దేశానికి ఐదోసారి అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికైన తరువాత తొలిసారి తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మే 16, 17 తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించబోతున్నట్లు ఇప్పటికే చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎనిమిది నెలల కాల వ్యవదుల్లో పుతిన్ చైనాలో పర్యటించడం ఇదో రెండోసారి. గత అధ్యక్ష ఎన్నికకు ముందుగా ఒక సారి చైనాలో పర్యటించారు. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. దీంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనాకు వెళ్లనున్నారు.
ఇక ఈ పర్యటనలో భాగంగా చైనా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వ్లాదిమిర్ పుతిన్ సమావేశం కానున్నారు. ఆ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల గురించి వారు చర్చించనున్నారు. డ్రాగన్ ప్రెసిడెంట్ జిన్‌పింగ్ గతవారమే ఐదు రోజుల పాటు ఐరోపా పర్యటన ముగించుకున్నారు. అందులో భాగంగా సెర్బియా, హంగరీలనూ సందర్శించారు. అమెరికా (America) నేతృత్వంలోని పాశ్చాత్య దేశంకు వ్యతిరేకంగా రెండు అధికార మిత్రదేశాల మధ్య ఐక్యత దేనికి సంకేంతాలు ఇస్తుందో వేచి చూడాలి.