Mushir Khan : సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన సర్ఫరాజ్ తమ్ముడు
ముంబై (Mumbai) యువ ఆటగాడు, సర్ఫ్ రాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (Mushir Khan) రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఫైనల్లో కూడా అదరగొట్టాడు.
ముంబై (Mumbai) యువ ఆటగాడు, సర్ఫ్ రాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (Mushir Khan) రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఫైనల్లో కూడా అదరగొట్టాడు. విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. తద్వారా ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండేది.అయితే ఈ మ్యాచ్‌ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించాడు.