Hyderabad Sadar celebrations : హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
నేడు హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏలో నవంబర్ 14, 15 తేదీలలో రాత్రి 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరక సదర్ ఉత్సవ్ మేళా జరగనుంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.

Sadar celebrations in Hyderabad Traffic restrictions in many places in the city
నేడు హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏలో నవంబర్ 14, 15 తేదీలలో రాత్రి 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరక సదర్ ఉత్సవ్ మేళా జరగనుంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. విట్టల్ వాడి ఎక్స్ రోడ్స్ నుంచి వైఎంసీఏ, నారాయణ గూడ వైపు రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపుకు మళ్లీంచారు. రాజ్‌మొహల్లా నుండి ట్రాఫిక్‌ను అనుమతించరు. సాబూ షాప్ పాయింట్ వద్ద రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. రెడ్డి కళాశాల నుండి వాహనాలను పాతబస్తీ బర్కత్‌పురా వైపు మళ్లిస్తారు. పాత బర్కత్‌పురా పోస్టాఫీసు నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్‌ను అనుమతించబోమని ట్రాఫిక్ కమిషనర్ వెల్లడించారు. క్రౌన్ కేఫ్ లేదా లింగంపల్లి వైపు మళ్లిస్తామని అధికారులు తెలిపారు. దీంతోపాటు పాత ఎక్సైజ్ ఆఫీస్ లేన్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే ట్రాఫిక్‌ను విట్టల్‌వాడి వైపు మళ్లిస్తారు. బర్కత్‌పురా చమన్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్ వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. ఇక వాహనాదారులు తమ తమ గమ్యస్థానానికిచేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహాకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.