Sahitya Infra Scam : సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్ 1800 కోట్లు
ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా సంస్థం భారీ కుభకోణం చేసినట్టు తేల్చారు పోలీసులు. వంద రెండు వందలు కాదు.. 18 వందలు.. ఏకంగా 18 వందల కోట్లు స్కామ్ చేసినట్టు నిర్ధారించారు. ప్రీ లాంచ్ పేరుతో భూములు కొనకుండానే కొన్నట్టు కస్టమర్లను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. ఈ డబ్బులన్నీ ప్రాజెక్ట్‌లు కట్టకుండా తమ అవసరాలకు సాహితీ సంస్థ వాడుకుంది. ఇప్పటికే వరకూ 9 ప్రాజెక్టుల్లో భాగంగా సాహితీ సంస్థకు వ్యతిరేకంగా 50 కేసులు నమోదైనట్టు పోలీసులు చెప్తున్నారు.
ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా సంస్థం భారీ కుభకోణం చేసినట్టు తేల్చారు పోలీసులు. వంద రెండు వందలు కాదు.. 18 వందలు.. ఏకంగా 18 వందల కోట్లు స్కామ్ చేసినట్టు నిర్ధారించారు. ప్రీ లాంచ్ పేరుతో భూములు కొనకుండానే కొన్నట్టు కస్టమర్లను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. ఈ డబ్బులన్నీ ప్రాజెక్ట్‌లు కట్టకుండా తమ అవసరాలకు సాహితీ సంస్థ వాడుకుంది. ఇప్పటికే వరకూ 9 ప్రాజెక్టుల్లో భాగంగా సాహితీ సంస్థకు వ్యతిరేకంగా 50 కేసులు నమోదైనట్టు పోలీసులు చెప్తున్నారు. చాలా ఏళ్ల నుంచి ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ నిందితులు కోట్ల రూపాయలు వెనకేసినట్టు పోలీసులు గుర్తించారు.
సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు.. సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు.. సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు..సాహితీ సితార పేరుతో 135 కోట్లు.. సాహితీ మెహతో పేరుతో 44 కోట్లు.. ఆనంద ఫర్చూన్ పేరుతో 45 కోట్లు.. సాహితీ కృతి పేరుతో 16 కోట్లు.. సాహితీ సుదిక్ష పేరుతో 22 కోట్లు..రూబికాన్ సాహితీ పేరుతో.. 7 కోట్లు వసూలు చేసింది సాహితీ మేనేజ్‌మెంట్. సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ ఎస్. పూర్ణచంద్రరావు, వారి కుటుంబ సభ్యులు, సంబంధిత సంస్థలకు చెందిన 161 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.
రియల్ ఎస్టేట్ కుంభకోణంలో సాహితీ ఇన్‌ఫ్రాటెక్, దాని ప్రమోటర్లపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన చీటింగ్ కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. సాహితీ ఇన్‌ఫ్రా దాదాపు 655 మంది వివిధ ప్రాజెక్ట్‌ల కొనుగోలుదారులకు ఫ్లాట్లు, విల్లాలను డెలివరీ చేస్తానని హామీ ఇచ్చింది. 2018 నుంచి వివిధ ప్రాజెక్ట్‌ల పేర్లు చెప్పి ఈ స్కామ్ చేశారు సాహితీ మేనేజ్‌మెంట్‌లోని సభ్యుల. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని కూడా ఎర్పాటు చేశారు. దర్యాప్తు తరువాత ఈ కేసుకు సంబంధించిన మరిన్న కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.