Bollywood, Sai Pallavi : బాలీవుడ్ ను రౌడీ బేబీ తట్టుకోగలదా..?
అసలే అక్కడ బికీనీలు, ఐటమ్ సాంగ్స్ లో మెరిసేవాళ్లే హీరోయిన్లు అనేంతగా పరిస్తితి మారిపోయింది. ఆలియా ఎంత మంచి నటి అయినా, దీపికా ఎంత బాగా నటించినా గ్లామర్ డోస్ పెంచితే తప్ప వాళ్లకి అక్కడ అడ్రస్ ఉండదు.. మరి రౌడీ బేబీ కి ఎలా..?

Sai Pallavi is going to travel in the dream of Bollywood Sai Pallavi has created a special image for herself here as she has done selective films like MCA Fida Kannam Virata Parvam
బాలీవుడ్ కలలో ప్రయాణం చేయనున్న సాయిపల్లవి..!
సాయిపల్లవి ఎమ్ సీఏ, ఫిదా, కణం, విరాట పర్వం ఇలా అన్నీ సెలెక్టీవ్ గా సినిమాలు చేసిన తనకంటూ ఇక్కడ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక అందాల ఆరబోతకంటే పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలకే సై అంది. అలాంటి తను బాలీవుడ్ లో ఇమడగలదా?
సాయిపల్లవికి అసలైన ఇబ్బందులు షురూ..?
అసలే అక్కడ బికీనీలు, ఐటమ్ సాంగ్స్ లో మెరిసేవాళ్లే హీరోయిన్లు అనేంతగా పరిస్తితి మారిపోయింది. ఆలియా ఎంత మంచి నటి అయినా, దీపికా ఎంత బాగా నటించినా గ్లామర్ డోస్ పెంచితే తప్ప వాళ్లకి అక్కడ అడ్రస్ ఉండదు.. అలా ఉంది సీన్.. అలాంటి ప్లేస్ లో సాయిపల్లవి ఇముడుతుందా అంటే కష్టమే..
బీటౌన్ లోని పరిస్థితులను రౌడీ బేబీ తట్టుకుంటుందా..?
కాని రాజ్ కుమార్ రామ్ తో జోడీకట్టి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది సాయిపల్లవి. మరి కేవలం ఒకటి రెండు సినమాలు చేసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటోందా? లేదంటే పూజాహోగ్డే, రష్మికాలా బాలీవుడ్ కలలు కంటోందా అనే ప్రశ్నలు ఎదురౌతున్నాయి. కాకపోతే నయనతార లా నచ్చిన సినిమా చేసి తర్వాత సౌత్ మూవీలతోనే బిజీ అవ్వొచ్చనే ఆప్షన్ కూడా ఉంది. ఏదేమైనా గ్లామర్ కంటే పాత్రలకే ప్రయారిటీ ఇచ్చే విద్యాబాలన్, రాధికా ఆప్టేల లా మెరిసి మాయమౌతుందా? అసలు ఒక సినిమా అయిన చేయగలుగుతుందా అన్న అనుమానాలే కామెంట్ల రూపంలో పెరిగాయి.