సాయిసుదర్శన్ సూపర్ ఫామ్, యువ క్రికెటర్ అరుదైన రికార్డ్
ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు.

ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయడంలో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా అతడు ఐపీఎల్ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 30 ఇన్నింగ్స్‌ల తర్వాత 1,307 రన్స్ చేసి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. షాన్ మార్ష్ మాత్రమే అతనికంటే ముందున్నాడు. క్రిస్ గేల్ , కేన్ విలియమ్సన్ , మాథ్యూ హేడెన్ వంటి దిగ్గజాలు సుదర్శన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేగాక ఐపీఎల్‌లో ఒకే వేదికపై వరుసగా ఐదుసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఏకైక భారత క్రికెటర్ గానూ నిలిచాడు.