సల్మాన్ దుబాయ్ కి దౌడ్, కారణం అదే

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు ప్రాణ భయంతో ఏం చేయాలో తోచక ఏది పడితే అది చేస్తున్నాడు. ఇటీవల ఈ కండల వీరుడు అమెరికా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 28, 2024 | 06:51 PMLast Updated on: Oct 28, 2024 | 6:51 PM

Salman Khan Plan To Go Dubai

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు ప్రాణ భయంతో ఏం చేయాలో తోచక ఏది పడితే అది చేస్తున్నాడు. ఇటీవల ఈ కండల వీరుడు అమెరికా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరిగింది. సల్మాన్ ఖాన్ ను అసలు వదిలే ఛాన్స్ లేదని ఆయన ఎక్కడ దాక్కున్నా లేపెస్తాం అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు టేకప్ చేసాడు. అటు రియాలిటీ షోలు కూడా ఓకే చేసాడు. కాని బాబా సిద్దిఖీని కాల్చి చంపిన తర్వాత సల్మాన్ లో భయం మొదలయింది.

ఎప్పుడు ఎక్కడ లారెన్స్ గ్యాంగ్ ఎటాక్ చేస్తుందో అని సల్మాన్ ఇప్పుడు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఆయన దుబాయ్ వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. ‘దబాంగ్ రీలోడెడ్’ షో షూట్ కోసం దుబాయ్ వెళ్ళడానికి టికెట్ లు బుక్ అయ్యాయి. ఇక ఆయనతో పాటుగా బాలీవుడ్ స్టార్ లు… జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, సునీల్ గ్రోవర్, అస్తా గిల్, మనీష్ పాల్ కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నారు. డిసెంబర్ 7న ఈ షో ప్రారంభం కానుండగా… దుబాయ్ హార్బర్‌లో ఈ షో ప్లాన్ చేసారు.

ఇప్పటికే టికెట్స్ బుకింగ్ కూడా స్టార్ట్ చేసారు. ఒకవైపు సల్మాన్ ను చంపుతామని లారెన్స్ గ్యాంగ్ పలు రూపాల్లో బెదిరిస్తున్న సమయంలో సల్మాన్ ధైర్యంగానే దుబాయ్ లో ఈ షూట్ కి హాజరు కావడం హాట్ టాపిక్ అయింది. ఫ్యాన్స్ లో ఇప్పుడు భయం పీక్స్ లో ఉంది. సల్మాన్ ఇండియాలో ఉండటం ఉత్తమం అని… కొన్నాళ్ళ పాటు అసలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని నమ్మవద్దు అని కోరుతున్నారు ఫ్యాన్స్. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సల్మాన్ కు భద్రత కల్పించినా… సల్మాన్ మాత్రం ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా భద్రత తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీ కోసం నిస్సాన్ బ్రాండ్‌కు చెందిన‌ బులెట్ ప్రూఫ్ కార్ ని కొన్నాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ తో పాటుగా బాంబ్ ప్రూఫ్ కారు కూడా కొనలని సల్మాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియ‌న్ మార్కెట్‌లో ఈ నిస్సాన్ పెట్రోల్ కారు అందుబాటులో లేకపోవడంతో మొదటి కారుని దుబాయ్ నుంచి తెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ దుబ్బాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారుని కొంటున్నాడు. ఇంపోర్ట్ చేసుకునేందుకు ఇప్పటికే అక్కడి సన్నిహితులకు డబ్బు కూడా పంపాడు అని సమాచారం.