చెప్పి మరీ కొట్టాడు, కొంటాస్ పై ప్రశంసలు

జాతీయ జట్టులోకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ వచ్చిన అవకాశాన్ని మిగిలిన ఆటగాళ్ళ కంటే భిన్నంగా తనదైన ముద్ర వేసినప్పుడే గుర్తింపు దక్కుతుంది... ఇలాంటి ఛాన్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు ఆసీస్ యువ క్రికెటర్ శాం కొంటాస్...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 12:33 PMLast Updated on: Dec 27, 2024 | 12:33 PM

Sam Konstas Well Batting In 4th Test

జాతీయ జట్టులోకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ వచ్చిన అవకాశాన్ని మిగిలిన ఆటగాళ్ళ కంటే భిన్నంగా తనదైన ముద్ర వేసినప్పుడే గుర్తింపు దక్కుతుంది… ఇలాంటి ఛాన్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు ఆసీస్ యువ క్రికెటర్ శాం కొంటాస్… 19 ఏళ్ళకే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకర్షించిన కొంటాస్ బాక్సింగ్ డే టెస్టులో దుమ్మురేపాడు.. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అది కూడా అత్యుత్తమ బౌలర్ బుమ్రా లాంటి వాడిని ఎదుర్కొని మరీ ఫిప్టీ చేశాడంటే అతన్ని అభినందించకుండా ఉండలేం… సాధారణంగా బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ బ్యాటర్లు సైతం తీవ్రంగానే ఇబ్బందిపడతారు… వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న బుమ్రా బంతులను కనీసం డిఫెండ్ చేసుకుంటే చాలన్న రీతిలో ఆలోచిస్తారు.. కానీ శాం కొంటాస్ మాత్రం దీనికి భిన్నంగా ఆడాడు.

తొలి మ్యాచ్ ఆడుతున్నానన్న భయం కానీ, ఒత్తిడి కాని ఎక్కడా కనిపించలేదు.. నిజానికి ఈ మ్యాచ్ కు ముందు బూమ్రా గురించి కొంటాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా బౌలింగ్ అంటే తనకేం భయం లేదంటూ కామెంట్ చేశాడు. అతని కోసం తన ప్లాన్స్ తనకున్నాయంటూ చెప్పాడు. కొత్త కుర్రాడు కదా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటుందిలే అనుకుంటుండగా.. మ్యాచ్ లో మాత్రం తన ప్లాన్స్ ను పక్కాగా అమలు చేసేశాడు. కౌంటర్ ఎటాక్ తో బుమ్రాకు చుక్కలు చూపించాడు. నిజానికి కొంటాస్ రెచ్చగొట్టి కోహ్లీ తప్పు చేయడం కూడా ఆసీస్ కు కలిసొచ్చింది. ఈ గొడవ తర్వాత బుమ్రాను టార్గెట్ చేసిన సామ్ కోన్‌స్టాస్..అతనిపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతని ధాటికి మూడేళ్ల తర్వాత బుమ్రా టెస్ట్‌ల్లో సిక్స్ సమర్పించుకున్నాడు. బుమ్రా ఎన్నడూ లేని విధంగా తొలి 6 ఓవర్లలోనే 38 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సామ్ కోన్‌స్టాస్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. పేసర్లను అలవోకగా ఆడుతున్న సామ్ కొంటాస్ ను జడేజా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అయితే అతను ఇచ్చిన మెరుపు ఆరంభంతో ఆసీస్ భారీస్కోరుకు మంచి పునాదే పడింది. మొత్తం మీద బుమ్రాను చెప్పి మరీ కొట్టాడంటూ పలువురు ఆసీస్ యువ ఆటగాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.