Samatha : ఓజోన్ ట్రీ ట్‌మెంట్‌లో సమంత..టెన్షన్‌లో ఫ్యాన్స్
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ (Star Heroine) సమంత హెల్త్ ఇష్యూ (Health Issue) కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. ఇండస్ట్రీ (Industry) లో శామ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో మయోసైటిసిస్ వ్యాధి బారిన పడింది.. అప్పటి నుంచి సమంత ఈ వ్యాధితో పోరాటం చేస్తోంది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ (Star Heroine) సమంత హెల్త్ ఇష్యూ (Health Issue) కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. ఇండస్ట్రీ (Industry) లో శామ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో మయోసైటిసిస్ వ్యాధి బారిన పడింది. అప్పటి నుంచి సమంత ఈ వ్యాధితో పోరాటం చేస్తోంది. తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శామ్.. ప్రస్తుతం మయోసైటిస్ (Myositis) ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఎంతో కఠినమైన చికిత్స తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తోంది. నాగ చైతన్యతో విడాకుల ఇష్యూతో మానసికంగా దెబ్బ తిన్న సమయంలోనే.. ఈ వ్యాధి బారిన పడిన శామ్.. తన టఫ్ టైమ్ నుంచి బయటపడేందుకు ఓ వారియర్‌లా పోరాడుతోందంటూ ఆమె ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. ఇక.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పటికీ ఫ్యాన్స్‌తో మాత్రం సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటూ.. ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓజోన్ థెరఫీ తీసుకుంటున్నగా షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ ఫొటోను చూసి శామ్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఏంటి..? ఏంటి సమంతకు ఇంకా ఆరోగ్యం బాగు కాలేదా ఇంకా సమస్యతో బాధపడుతూనే ఉందా అంటూ బాధపడుతున్నారు.. సమంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.. కాగా.. సమంత ప్రస్తుతం ఆమె ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ను తీసుకుంటోంది. అలాగే ఇప్పుడిప్పుడే ఆ అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా కోలుకుంటోందని తెలుస్తోంది. మరో వైపు తన బిజినెస్ లు, ఫౌండేషన్స్‌పై కూడా దృష్టి పెట్టింది. త్వరలోనే సామ్ మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ టైమ్‌లో తన ట్రీట్‌మెంట్‌పై సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇక.. సమంత ఎప్పుడెప్పుడు ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. సామ్ గత ఏడాది ఖుషి సినిమా తో ప్రేక్షకులను పలకరించింది.. ఈ సినిమా తర్వాత సమంత చేతిలో పలు సినిమాలు ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితులు ఆమె అడ్వాన్స్ ని కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది.. దీంతో సమంత రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. శామ్ కమ్ బ్యాక్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు.