నాకు రానా లాంటి బ్రదర్ కావాలి: సమంతా సెన్సేషన్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సమంతా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేసిన ఈ అమ్మడు తాజాగా అలియా భట్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2024 | 07:33 PMLast Updated on: Oct 08, 2024 | 7:33 PM

Samantha Interesting Comments On Rana

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సమంతా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేసిన ఈ అమ్మడు తాజాగా అలియా భట్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది. జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సమంతా కీలక వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్స్ గా మాకు ఓ బాధ్యత ఉంటుందని తెలిపింది.

మా‌ సినిమాలు చూసే అమ్మాయిలకు ఎవరి కథలో వారే హీరో అనే విషయాన్ని గుర్తు చేయడం బాగుందని తెలిపింది. అలియా ఆ విషయాన్ని తన సినిమా ద్వారా గుర్తు చేసిందని కొనియాడింది. రానా నాకు బ్రదర్ లాంటివాడు‌‌ అని అతని లాంటి బ్రదర్ ప్రతి అమ్మాయికి ఉండాలని కొనియాడింది. తెలుగు వారి ప్రేమ వల్లే ఎదిగానన్న సమంతా నాకు జిగ్రాస్ అంటే నా అభిమానులే అంటూ క్లారిటీ ఇచ్చింది.