Samantha: నాకు నేనే తోడు… నాకు నేనే ధైర్యం

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2023 | 06:53 AMLast Updated on: Feb 04, 2023 | 6:53 AM

Samantha Latest Tweet

సమంత మళ్లీ యాక్టివ్ అవుతోంది. తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతోంది. ఓవైపు శాకుంతలం ప్రమోషన్స్..మరోవైపు సిటాడెల్ షూట్ తో సామ్ కొత్త ఏడాదిలో ఉరిమే ఉత్సాహంతో అడుగులేస్తోంది.ఎనిమిది నెలల్లో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని ఆసక్తికర పోస్ట్ చేసింది. సాం మయోసైటిస్ తో బాధ పడుతోంది.ఆమె ఆరోగ్యంపై బోలెడు పుకార్లు షికార్లు చేశాయి.మునుపటిలా సామ్ లేదంటూ ప్రచారం సాగింది.ఈ రూమర్స్ ని సమంత ధైర్యంగా తిప్పికొట్టింది.మయో సైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని కేరీర్ పై మళ్లీ దృష్టి పెట్టింది.

జనవరిలో సమంత సూపర్ యాక్టివ్ అయింది. అటు శాకుంతలం ప్రమోషన్స్ ఇటు సిటాడెల్ షూట్ తో హుషారుగా గడిపింది. ఆమె వర్క్ లైఫ్ కు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది.గత నెల ఎలా గడిచిందో పిక్స్ తో వివరించింది. సిటాడెల్ టీమ్ తో మీటింగ్, వర్కౌట్లు,అలసట, ఫొటో షూట్ లతో జనవరి పూర్తయిందని ఆసక్తికర పోస్ట్ తో తనకు తానే ధైర్యం చెప్పుకుంది.

ఎనిమిది నెలల్లో పడిన కష్టాలను సామ్ వివరించింది.దేనిపైనా దృష్టి పెట్టలేకపోయా,సరిగ్గా నడవలేకపోయా..ఇన్ని ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా ముందు అడుగు వేశానని చెప్పుకొచ్చింది. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంది. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నానని రాసుకొచ్చింది.

సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆమె మళ్లీ ఇంతకుముందులా యాక్టివ్ కావడంపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.