విష్ణువుకి శాపం ఇచ్చిన సముద్రుడు – కుంభమేళా వెనుక అసలు రహస్యం ఇదేనా..!

కుంభమేళా.. హిందువుల ఆధ్యాత్మిక సంబరం. కుంభమేళా మూలం సముద్ర మథనంతో ముడిపడి ఉంది. అమృతం కోసం సముద్రం మథనం చేశారని అందరికీ తెలుసు. కానీ.. సముద్ర మథనానికి అసలు కారణం వేరే ఉందట. మహావిష్ణువుకి సముద్రుడు ఇచ్చిన శాపమే.. సముద్ర మథనానికి దారితీసిందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 04:12 PMLast Updated on: Dec 14, 2024 | 4:12 PM

Samudra Cursed Vishnu Is This The Real Secret Behind The Kumbh Mela

కుంభమేళా.. హిందువుల ఆధ్యాత్మిక సంబరం. కుంభమేళా మూలం సముద్ర మథనంతో ముడిపడి ఉంది. అమృతం కోసం సముద్రం మథనం చేశారని అందరికీ తెలుసు. కానీ.. సముద్ర మథనానికి అసలు కారణం వేరే ఉందట. మహావిష్ణువుకి సముద్రుడు ఇచ్చిన శాపమే.. సముద్ర మథనానికి దారితీసిందట. ఆ కథేంటో తెలుసుకుందాం.

జనవరి 13వ తేదీ నుంచి కుంభమేళా అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు కోసం ఏర్పాట్లు ఒక రేంజ్‌లో జరుగుతున్నాయి. ఆథ్యాత్మిక శోభ ఉట్టిపడేలా.. అడుగడుగునా భక్తిభావంతో నిండిపోయేలా చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు… నాగ సాధువులు తరలివచ్చే.. కుంభమేళాలో పవిత్రత ఉట్టిపడనుంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ కుంభమేళాపై… ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. అయితే… కుంభమేళా నిర్వహరణకు అసలు కారణాలు ఏంటి అన్నది చాలా అన్వేనిషిస్తున్నారు. దీంతో.. అనేక పురాణ కథలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

కుంభమేళా మూలం సముద్ర మథనం కథతో ముడిపడి ఉందని హిందువుల నమ్మకం. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథించారు. దేవతలు , రాక్షసుల మధ్య 12 రోజుల పాటు అమృత కలశం విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో అమృత కళశం నుంచి కొన్ని బిందువులు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో భూమిపై పడ్డాయి. అందుకే.. ఆ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహించారని అంటారు. అయితే.. సముద్ర మథనానికి మరో కారణం కూడా ఉందంట. అది మహావిష్ణువుకి సముద్రుడు ఇచ్చిన శాపం… సముద్ర మథనానికి దారితీసిందని పురాణాలు చెప్తున్నాయి. ఆ శాపం ఏంటి…? విష్ణువుకి సముద్రుడు ఎందుకు శాపం ఇచ్చాడు..?

కుంభమేళా వెనుక అసలు కథ..!

పురాణాల ప్రకారం… శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి క్షీరసాగరంలో ఉంటారు. సముద్ర పాలకుడు సముద్రుడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శంఖం. సముద్రంలో ఉండే జీవుల నుంచి సముద్రుడు పన్నులు వసూలు చేసే వాడట. కుమారుడు శంఖం.. చేతికి అందివచ్చిన తర్వాత… ఆ బాధ్యతలను అతనికి అప్పగించాడు. అయితే.. రాక్షసుల మాట విని.. వారి మాయలో పడ్డ శంఖం.. ముల్లోకాలను ఏలే శ్రీమహావిష్ణువుని పన్ను కట్టమని అడిగాడట. అంతటితో ఆగకుండా.. నోటికొచ్చిన దుర్భాషాలు ఆడాడు. విష్ణువు పక్కనున్న లక్ష్మీదేవిని కూడా తూలనాడాట. అవి సహించలేకపోయిన విష్ణువు… శంఖంను వధించాడు. ఈ విషయం తెలిసిన సుముద్రుడు…. ఏం జరిగిందో తెలుసుకోకుండా… విష్ణువుపై కోపంతో రగిలిపోయాడు. లక్ష్మీదేవి వల్ల.. ఇదంతా జరిగిందని భావించి… విష్ణువు నుంచి లక్ష్మీదేవి దూరమవుతుందని.. సముద్రంలో కలిసిపోతుందని శపించాడట. దీంతో.. లక్ష్మీదేవి సముద్రంలో కలిసిపోయింది. లక్ష్మీదేవిని తిరిగి రప్పించేందుకు… మహావిష్ణువు… దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం జరిగేలా చేశాడట. దీంతో.. సముద్రుడు.. అమృత కలశంతోపాటు లక్ష్మీదేవిని కూడా పంపాల్సి వచ్చిందట. అలా సముద్రం నుంచి ఉద్భవించిన మహాలక్ష్మిని… శ్రీమహావిష్ణువు మరోసారి మనువాడాడు. సముద్ర మథనంతో ముడిపడిన కుంభమేళా వెనుక అసలు కథ ఇదే.