Sania Mirza: కోహ్లీ వల్ల కానిది సానియామీర్జా వల్ల అవుతుందా..?
టెన్నిస్ స్టార్ సానియా రూట్ మార్చింది. రాకెట్‌ను వదిలి బ్యాట్ పట్టుకోబోతోంది. ఇన్నాళ్లు టెన్నిస్ కోర్టులో విహరించిన ఈ అమ్మడు ఇకపై క్రికెట్ గ్రౌండ్‌ను దున్నేయబోతోంది. అంటే ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ నేర్చేసుకుని... ప్యాడ్లు కట్టుకుని బరిలోకి దిగి బౌండరీలు బాదేయబోవడం లేదీ అమ్మడు... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా టీమ్‌కు మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తింది సానియా..
టెన్నిస్ స్టార్ సానియా రూట్ మార్చింది. రాకెట్‌ను వదిలి బ్యాట్ పట్టుకోబోతోంది. ఇన్నాళ్లు టెన్నిస్ కోర్టులో విహరించిన ఈ అమ్మడు ఇకపై క్రికెట్ గ్రౌండ్‌ను దున్నేయబోతోంది. అంటే ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ నేర్చేసుకుని… ప్యాడ్లు కట్టుకుని బరిలోకి దిగి బౌండరీలు బాదేయబోవడం లేదీ అమ్మడు… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా టీమ్‌కు మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తింది సానియా..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఓ జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. స్మృతి మందాన, ఎల్లీస్ పెర్రీ, మేఘన్ షట్, సోఫీ డెవిన్, రిచాఘోష్ వంటి మంచి టీమ్‌ను కూడా వేలంలో కొనుగోలు చేసింది. మార్చి 4నుంచి 26వరకు తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముంబయిలో జరగనుంది. ఇందులో పాల్గొనే తమ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపి విజయపథంలో నడిపే బాధ్యతను మెంటార్‌గా సానియాకు అప్పగించింది ఆర్సీబీ.. సానియా ప్రస్తుతం దుబాయ్ ఓపెన్ సన్నాహాల్లో ఉన్నారు. అదే ఆమె చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్. అది ముగిసిన వెంటనే ఆర్సీబీ మహిళా జట్టు మెంటార్‌గా ఎంటరవుతారు సానియామీర్జా.
సాధారణంగా ఇప్పటివరకు ఐపీఎల్ టీమ్‌లు క్రికెట్ లెజెండ్స్‌నే మెంటార్‌గా నియమించుకుంటూ వచ్చాయి. వారికైతే సాధకబాధకాలు తెలుస్తాయని భావించాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం భిన్నంగా ఆలోచించి సానియా మీర్జాకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ఆర్సీబీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే తగిన వ్యక్తి మరొకరు దొరకరని కామెంట్ చేసింది. తనను మెంటార్‌గా నియమించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసిందని సానియా వ్యాఖ్యానించింది. అయితే తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తానని చెప్పుకొచ్చింది.
టెన్నిస్‌స్టార్‌గా సానియా దేశ కీర్తి ప్రతిష్ఠను ఇనుమడింపచేసింది. గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి భారతీయురాలు ఆమె.. ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆరు పతకాలు సాధించింది. సుదీర్ఘ కెరియర్‌లో ఎన్నో అవరోధాలను అధిగమించింది. ఇటీవలే తన చివరి గ్రాండ్‌స్లామ్ కూడా ఆడేసింది. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని ఛాంపియన్‌గా నిలిచిన సానియా…తమ జట్టును ఛాంపియన్‌గా నిలపగలదని ఆర్సీబీ భావిస్తోంది. మరి ఆర్సీబీ ఆశలను సానియా నిజం చేస్తుందా…? పురుషుల జట్టు సాధించలేని ఐపీఎల్ టోర్నీని మహిళా క్రికెట్ జట్టు సాధిస్తుందా…?