టెస్ట్ జట్టులోకి సంజూ రెడీగా ఉండమన్నారంటూ హింట్
టీమిండియా యువక్రికెటర్ సంజూ శాంసన్ త్వరలో టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సంజూనే స్వయంగా వెల్లడించాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు తనను కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ రెడీగా ఉండమన్నారంటూ చెప్పాడు.
టీమిండియా యువక్రికెటర్ సంజూ శాంసన్ త్వరలో టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సంజూనే స్వయంగా వెల్లడించాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు తనను కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ రెడీగా ఉండమన్నారంటూ చెప్పాడు. దీని కోసం మరిన్ని రంజీ మ్యాచ్ లు ఆడాలని సూచించినట్టు సంజూ చెప్పుకొచ్చాడు. వచ్చే రంజీ సీజన్ లో పలు మ్యాచ్ లు ఆడేందుకు ప్రస్తుతం ఈ కేరళ క్రికెటర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ తో ప్రతీ ప్లేయర్ నైపుణ్యం వెలుగులోకి వస్తుందన్నాడు. తాను కేవలం వైట్ బాల్ ఫార్మాట్ కే పరిమితయ్యే ఆటగాడిని కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇండియాకు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవంగా చెప్పుకొచ్చాడు. దులీప్ ట్రోఫీకి ముందు కోచ్ గంభీర్ , కెప్టెన్ రోహిత్ శర్మ తనతో మాట్లాడారని, మరిన్ని రంజీ ట్రోఫీలు ఆడేలా ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చినట్టు వెల్లడించాడు.
తన ప్రిపరేషన్ అద్భుతంగా సాగుతుందన్న సంజూ ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నట్టు చెప్పాడు. దులీప్ ట్రోఫీలో సెంచరీ చేయడం తన కాన్ఫిడెన్స్ పెంచిందన్నాడు. దేశంలో బెస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు చేయడం సంతోషాన్నిచ్చిందన్న సంజూ రంజీ సీజన్ లోనూ నిలకడగా రాణించడమే లక్ష్యంగా ఆడతానని చెప్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 64 మ్యాచ్ లు ఆడిన సంజూ శఆంసన్ 3819 పరుగులు చేశాడు. 2015 లో టీ ట్వంటీ, 2021లో వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన శాంసన్ ఇప్పటి వరకూ 16 వన్డేలు, 33 టీ ట్వంటీలు ఆడాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ను లీడ్ చేస్తున్న ఈ కేరళ క్రికెటర్ ఈ మెగా లీగ్ లో రాణిస్తున్నా జాతీయ జట్టులో చోటు సుస్థరం చేసుకోలేకపోతున్నాడు.
ఇటీవల తనపై వచ్చిన విమర్శలకు బంగ్లాదేశ్ తో సిరీస్ లో చెక్ పెట్టాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన టీ ట్వంటీలో సెంచరీతో దుమ్మురేపాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడమే కాకుండా టీ ట్వంటీల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్ గానూ ఘనత సాధించాడు. సంజూ ఫామ్ లోకి రావడంతో కివీస్ తో సిరీస్ తర్వాత జరిగే సౌతాఫ్రికా టూర్ కు ఎంపికవడం లాంఛనమే. అయితే ఈ లోపు రంజీ సీజన్ లోనూ ఈ కేరళ క్రికెట్ జోరు కొనసాగిస్తే ఆసీస్ టూర్ కు సెలక్టర్లు పరిగణలోకి తీసుకునే అవకాశముంటుంది.