ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఎవరి కోసం కొట్టాడో తెలుసా ?
హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి టీ ట్వంటీ హీరో సంజూ శాంసనే... తన ప్లేస్ డైలమాలో పడిన వేళ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. అది కూడా సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే శతక్కొట్టిన సంజూ జట్టు రికార్డు స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి టీ ట్వంటీ హీరో సంజూ శాంసనే… తన ప్లేస్ డైలమాలో పడిన వేళ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. అది కూడా సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే శతక్కొట్టిన సంజూ జట్టు రికార్డు స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నిజానికి సంజూ ఇన్నింగ్స్ లో ప్రతీషాట్ అదిరిందనే చెప్పాలి. కానీ 10వ ఓవర్లో అయితే ఏకంగా ఐదు భారీసిక్సర్లతో బంగ్లా స్పిన్నర్ రిషద్ హోస్సేన్ కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్ తొలి బంతిని డాట్ చేసిన సంజూ శాంసన్.. ఫుల్‌టాస్‌గా వచ్చిన రెండో బంతిని సిక్సర్‌గా తరలించాడు. మూడో బంతిని లాంగాఫ్ దిశగా… నాలుగో బంతిని స్ట్రైట్‌గా.. ఐదో బంతిని లాంగాన్ దిశగా.. చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌బాది తాను ఎంత ప్రమాదకర ఆటగాడినో మరోసారి చాటి చెప్పాడు.
తొలి రెండు టీ20ల్లో ఆశించిన రీతిలో రాణించకపోయినా.. టీమిండియా మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. తర్వాతి ఫిఫ్టీని 18 బంతుల్లోనే అందుకున్నాడంటే అతని విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ టీ20ల్లో సంజూ శాంసన్‌కు ఇదే తొలి శతకం. ప్రస్తుతం అతని సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓవరాల్ గా సంజూ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఐదు సిక్సర్లు ఆషామాషీగా కొట్టినవి కాదని సంజూ చెప్పాడు. ఈ ఫీట్ సాధించడానికి తనకో ప్రత్యేకమైన కారణం ఉందంటూ చెప్పుకొచ్చాడు.
ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టడం బాగుందన్న సంజూ గత ఏడాది నుంచి భారీషాట్లు కొట్టేందుకు తీవ్రంగా శ్రమించానని గుర్తు చేసుకున్నాడు. తన మెంటార్ కోసం ఈ ఫీట్ చేశానని వెల్లడించాడు. మాజీ క్రికెటర్ బిజు జార్జ్ సంజూ శాంసన్ కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. తాను ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టడం చూడాలనుకుంటున్నట్టు చెప్పిన విషయాన్ని సంజూ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు అవకాశం రావడంతో ఆయన కోసం ఐదు సిక్సర్లు కొట్టానని ఈ కేరళ క్రికెటర్ చెప్పాడు.
దేశం కోసం ఆడేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుందిన్న సంజూ తన శైలిలో ప్రతి షాట్ ఆడానని హైదరాబాద్ మ్యాచ్ ఇన్నింగ్స్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్ , కోచ్ తనకు స్వేఛ్ఛ ఇవ్వడంతో పాటు అండగా నిలిచారని చెప్పాడు.