శాంట్నర్ కెరీర్ బెస్ట్ కివీస్ స్పిన్నర్ రికార్డ్
పుణే టెస్టులో టీమిండియా ఓటమిని శాసించిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిఛెల్ శాంట్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ల హాల్ సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా సాంట్నర్ నిలిచాడు.

పుణే టెస్టులో టీమిండియా ఓటమిని శాసించిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిఛెల్ శాంట్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ల హాల్ సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా సాంట్నర్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ న్యూజిలాండ్ స్పిన్నర్ కూడా భారత్‌పై ఈ ఫీట్ నమోదు చేయలేకపోయారు. ఓవరాల్‌గా ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ల ఘనత సాధించిన రెండో కివీస్ స్పిన్నర్‌గా సాంట్నర్ రికార్డులకెక్కాడు. సాంట్నర్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి రెండు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా,బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో వెట్టోరి ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.