సర్ఫరాజ్ డబుల్ సెంచరీ యువక్రికెటర్ నయా హిస్టరీ
దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ డబుల్ సెంచరీతో అదరగొట్టేశాడు. రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ 253 బంతుల్లో దిశ్వతకం సాధించాడు.
దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ డబుల్ సెంచరీతో అదరగొట్టేశాడు. రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ 253 బంతుల్లో దిశ్వతకం సాధించాడు. దీనిలో 24 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. డబుల్ సెంచరీ సాధించిన క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఇరానీ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ముంబై ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్ గానూ ఘనత సాధించాడు.
అంతేకాదు కనీసం 4 వేలకు పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో అత్యధిక సగటు ఉన్న రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సర్ఫరాజ్ 69.8 సగటుతో 4 వేల ప్లస్ రన్స్ చేశాడు. కాగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ కూడా ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కలేదు. టీమ్ మేనేజ్ మెంట్ కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వడంతో అతన్ని ఇరానీ కప్ కోసం బీసీసీఐ రిలీజ్ చేసింది. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సర్ఫరాజ్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ముంబై కెప్టెన్ అజింక్య రహానె 97 పరుగులకు ఔటై సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ డబుల్ సెంచరీతో ముంబై 536 పరుగుల భారీస్కోర్ సాధించింది.