ఏపీ రిజిస్టర్ ఆఫీసులపై సర్కార్ సంచలన నిర్ణయం
విజయవాడ పరిధిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రెడ్ కార్పెట్ ,పోడియం ను సిబ్బంది తొలగిస్తున్నారు. గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమం మొదలయింది.
విజయవాడ పరిధిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రెడ్ కార్పెట్ ,పోడియం ను సిబ్బంది తొలగిస్తున్నారు. గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమం మొదలయింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా, కమీషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎంవి శేషగిరి బాబు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రెవిన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలంటే ప్రజలు భయపడే వారు అన్నారు.
రాను రాను ఆ పద్ధతి పోయింది అని ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పని చేస్తారు అని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటీష్ పద్ధతి ఇంకా ఉందన్నారు. రెవిన్యూ ఇచ్చే ప్రజల ను మర్యాదపూర్వకంగా చూడాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలవుతున్న విధానం కోర్టు లో ఉన్నట్లు ఉంటుంది అని అందుకే ఈ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పిందన్నారు. అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రెడ్ కార్పెట్, పొడియం తొలగింపుకు సర్క్యులర్ ఇచ్చామని తెలిపారు.