Sarvey Sathyanarayana: కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతున్న సర్వే.. రెబల్‌గా బరిలో..
కాంగ్రెస్‌ను.. సర్వే రూపంలో కొత్త గండం ఎదురవుతోంది. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ.. హస్తం పార్టీని పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి బై ఎలక్షన్ జరుగుతోంది.
Sarvey Sathyanarayana: తెలంగాణలో అధికారం దక్కించుకొని.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్‌ను.. సర్వే రూపంలో కొత్త గండం ఎదురవుతోంది. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ.. హస్తం పార్టీని పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి బై ఎలక్షన్ జరుగుతోంది. ఐతే అటు మల్కాజ్‌గిరి, ఇటు కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ నామినేషన్ వేయడం.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
HARISH RAO VS REVANTH: రాజీనామా హైడ్రామా.. రేవంత్ వర్సెస్ హరీష్..
కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ నారాయణను కాంగ్రెస్ ప్రకటించింది. ఐతే కాంగ్రెస్ రెబల్‌గా సర్వే నామినేషన్ వేయడంతో కంటోన్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది. 1985లో కంటోన్మెంట్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున సర్వే సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఈ రెండు నియోజకవర్గాల మీద ఆయనకు అంతో ఇంతో పట్టు ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య.. సర్వే సత్యనారాయణ రెబెల్‌గా పోటీ చేయడం కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. హస్తం పార్టీకి ఎదురు తిరగడం వెనక సర్వే చాలా కారణాలు చెప్తున్నారు. 40 ఏళ్లుగా తాను కాంగ్రెస్‌లో ఉన్నానని.. తనను కాదని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడంపై ఆయన ఫైర్ అవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందని.. ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. హైకమాండ్‌లో తనకు గుర్తింపు ఉన్నా.. ఇక్కడి నాయకులు వారి సొంత లాభాల కోసం ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మరి సర్వే పోటీతో.. కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఓ సీనియర్ లీడర్.. రెబెల్‌గా బరిలో దిగడం.. పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉందనే వార్నింగ్స్ వినిపిస్తున్నాయ్.