SBI Debit Card Charges: ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

దీని ప్రకారం.. ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై ఏడాదికి రూ.125+ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ప్రస్తుతం రూ.175 ఛార్జీ ఉండగా.. ఈ ఛార్జీలను రూ.250కు పెంచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2024 | 07:08 PMLast Updated on: Mar 27, 2024 | 7:08 PM

Sbi Debit Card Annual Maintenance Charges Are Increased From April 1st

SBI Debit Card Charges: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. తాజాగా డెబిట్ కార్డ్ యానువల్ మెయింటెనెన్స్ ఛార్జీల్లో మార్పులు చేసింది. కార్డులపై గరిష్టంగా రూ.75 వరకు పెంచింది. దీనికి జీఎస్టీ అదనం. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎస్బీఐ వెబ్‌సైట్‌లో పెరిగిన ఛార్జీల వివరాలున్నాయి.

Delhi Metro: ఢిల్లీ మెట్రో వైరల్ వీడియో.. షాకింగ్ న్యూస్..

దీని ప్రకారం.. ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై ఏడాదికి రూ.125+ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ప్రస్తుతం రూ.175 ఛార్జీ ఉండగా.. ఈ ఛార్జీలను రూ.250కు పెంచింది. అలాగే ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. అలాగే.. ప్రైడ్‌, ప్రీమియం బిజినెస్‌ కార్డులపై ప్రస్తుతం రూ.350 యానువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తుండగా.. దాన్ని రూ.425కు పెంచింది. కొత్త ఛార్జీలన్నింటికీ జీఎస్‌టీ అదనం.

యానువల్ మెయింటెనెన్స్ ఛార్జీలతో పాటు, డెబిట్ కార్డుల జారీకి సంబంధించిన ఫీజులను కూడా మారుస్తామని ఎస్బీఐ తెలిపింది. మరోవైపు.. ఏప్రిల్ 1 నుంచి కొన్ని క్రెడిట్ కార్డులకు సంబంధించి రెంట్ చెల్లించే లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఇవ్వడాన్ని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ప్రతి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ఛార్జీల పెంపు, సవరణ ఉంటుంది.