Schools : నేడు తెలంగాణ వ్యాప్తంగా మూతపడ్డా స్కూళ్ల..
తెలంగాణలో వ్యాప్తంగా నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో ABVP రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది.
తెలంగాణలో వ్యాప్తంగా నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో ABVP రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని ఏబీవీపీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. దీంతో చాలా మంది విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లడం లేదు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరో వైపు స్టైఫండ్లకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మాణం సహా మొత్తం 8 ప్రధాన డిమాండ్‌లతో విద్యార్థి వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.