Lasya Nandita : వెంటాడిన మృత్యువు.. 3 నెలల్లో మూడు ప్రమాదాలు
కారు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ఆమె ప్రయాణించడమే ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే... ముందు సీటుకు నందిత వేగంగా ఢీకొన్నారు.

Secunderabad Cantonment MLA Lasya Nandita had three fatal accidents in the past few months
కారు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ఆమె ప్రయాణించడమే ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే… ముందు సీటుకు నందిత వేగంగా ఢీకొన్నారు. ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజీ కావడంతో అక్కడిక్కడే చనిపోయారు. నందితాను గత కొన్ని రోజులుగా వరుసగా మృత్యువు వెంటాడుతోందని జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతోంది.
మూడు నెలల క్రితం లాస్య ఉన్న లిఫ్టు కేబుల్స్ తెగి పడిపోయింది. దాంతో స్వల్ప గాయాలతో చావు నుంచి తప్పించుకున్నారు. పది రోజుల క్రితం నల్గొండలో కేసీఆర్ (KCR) సభకు వెళ్లి వస్తుండగా… నార్కెట్ పల్లి దగ్గర్లోని చర్లపల్లి ఏరియాలో లాస్య ప్రయాణిస్తున్న స్కార్పియో ఒక ఆటో ఢీకొంది. ఆ సంఘటనలో కారు ఓ హోంగార్డ్ ను ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. లాస్య స్వల్ప గాయాలతో బయటపడింది.
మళ్లీ ఇప్పుడు వరుసగా మూడోసారి మృత్యువు లాస్య నందితను వెంటాడింది. ORRపై స్పీడ్ గా వెళ్తూ ముందున్న వాహనాన్ని ఢీకొడతానని భయంతో.. డ్రైవరు స్టీరింగ్ ను పక్కకి తిప్పాడు. బండి రోడ్ సైడ్ కు వెళ్లి వాల్ ని ఢీకొని చనిపోయింది. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల లాస్య అక్కడికక్కడే చనిపోయింది.
నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ (Accident) చేసిన డ్రైవర్ కూడా ఇతనే. కనీసం మొదటిసారి యాక్సిడెంట్ జరిగిన తర్వాత అయినా డ్రైవర్ ని మార్చి ఉంటే.. ఈ ప్రమాదం జరిగేది కాదంటున్నారు. మూడు నెలల్లో మూడు రకాలుగా మృత్యువు లాస్య వెంటాడింది. చివరికి మూడోసారి లాస్య మృత్యువుకు లొంగిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం లాస్య తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన్న (Former MLA Sayanna) కూడా ఫిబ్రవరి 19న కన్ను మూశారు. ఏడాది టైమ్ లోనే ఆ కుటుంబంలో ఇది రెండో మరణం. దాంతో లాస్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.