Secunderabad Railway Station: విమానాశ్రయాన్ని మించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణం.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
సౌత్ సెంట్రల్ రైల్వేస్‌లో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ స్టేషన్‌గా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫేట్ మారిపోనుంది. అడ్వాన్స్‌డ్ ఇన్ఫాస్ట్రక్చర్‌తో స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ ఏకంగా రూ.720 కోట్లు కేటాయించింది.
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్త రూపు సంతరించుకోబోతుంది. సౌత్ సెంట్రల్ రైల్వేస్‌లో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ స్టేషన్‌గా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫేట్ మారిపోనుంది. అడ్వాన్స్‌డ్ ఇన్ఫాస్ట్రక్చర్‌తో స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ ఏకంగా రూ.720 కోట్లు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
శనివారం వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే శాఖ వెల్లడించింది. పూర్తి అభివృద్ధి జరిగిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ ఎలా ఉండబోతోందో చూపించేందుకు కొన్ని శాంపిల్ ఫొటోస్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపో్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను డిజైన్ చేశారు ఇంజినీర్స్. చాలా అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో స్టేషన్ డెవలప్ చేయబోతున్నారు. రూఫింగ్, పార్కింగ్, ఎస్కలేటర్స్, వెయింటింగ్ హాల్.. సేమ్ టు సేమ్ ఎయిర్‌పోర్ట్ లుక్‌లో ఉండేలా ప్లాన్ చేశారు.
పార్కింగ్ స్పేస్ కూడా పెంచి ఎంట్రీల డిజైన్ మార్చారు. రెండు ఎంట్రీలతో పాటు.. ట్రాక్స్ దగ్గర కూడా గ్రీనరీ ఉండేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌ను పడగొట్టి మూడు అంతస్తుల కొత్త బిల్డింగ్ నిర్మించబోతున్నారు. సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రజెంట్ హైదరాబాద్‌లో మనం చూస్తున్న మెట్రో స్టేషన్స్ ఎలా ఉన్నాయో.. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా అలానే మారబోతోంది. సౌత్ సెంట్రల్ రైల్వేస్‌లోనే ది బెస్ట్ డిజైన్ సికింద్రాబాద్ స్టేషన్‌కు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ అభివృద్ధి పనులకు రేపే ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు బేగంపేటకు చేరుకోనున్న ప్రధాని నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్తారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించి.. నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న బీజేపీ బహిరంగ సభకు చేకుంటారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తారు.