TS MINISTRY : హోంమంత్రిగా సీతక్క.. మంత్రి పదవులకు ఢిల్లీలో పైరవీలు
తెలంగాణలో ఈనెల 5 లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆషాఢం రాకముందే కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.
తెలంగాణలో ఈనెల 5 లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆషాఢం రాకముందే కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. కేబినెట్ లోకి మరో ఆరుగురిని తీసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరి శాఖలను మార్చబోతున్నట్టు సమాచారం. హోంశాఖ మంత్రిగా సీతక్కకు ఛాన్సుంది. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్టు .. మంత్రి దామోదర రాజనర్సింహ చిట్ చాట్ లో చెప్పారు. సీతక్కతో పాటు ఒకరిద్దరి మంత్రిత్వ శాఖల్లో మార్పులు జరగొచ్చు.
రేవంత్ కేబినెట్ లో చోటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి క్యూ కట్టారు. కొందరు రాష్ట్ర మంత్రులతో… మరికొందరు AICC పెద్దలతో టచ్ లో ఉన్నారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోనూ మంతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీ ఫామ్ పై గెలిచిన వారికే మంత్రి పదవులు ఇస్తామని రేవంత్ చెప్పడంతో BRS జపాంగ్ దానం నాగేందర్ కు మినిస్ట్రీ వస్తుందా అన్నది డౌటే. బీసీ కోటాలో ముదిరాజ్ వర్గం లీడర్ వాకాటి శ్రీహరి, బీసీ కోటాలో బీర్ల అయిలయ్య ట్రై చేస్తున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. అది కాకపోతే కేబినెట్ లో బెర్త అడుగుతున్నారు.
రెడ్డి కోటా నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్ రెడ్డి పదవి కోరుతున్నారు. ఇంకా రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పదవిని ఆశిస్తున్నారు.
ఇంకా రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. వెలమ వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. గడ్డం వివేక్, వినోద్ కూడా పదవుల కోసం AICC పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు. కేబినెట్ లో లంబాడీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో దేవర కొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి కావాలంటున్నారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది మంత్రులు ఉండటంతో… బాలూనాయక్ కి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ ఛీప్, నామినేటెడ్ పదవుల భర్తీని ఫైనలైజ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు.