సెహ్వాగ్ రికార్డునే దాటేశాడు సౌథీ అరుదైన ఘనత

ఒక బౌలర్ అత్యధిక సిక్సర్లు కొట్టడం అది కూడా టెస్ట్ క్రికెట్ లో మెరుపులు మెరిపించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆరో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 19, 2024 | 11:37 AMLast Updated on: Oct 19, 2024 | 11:37 AM

Sehwag Has Crossed The Record Southee Is A Rare Feat

ఒక బౌలర్ అత్యధిక సిక్సర్లు కొట్టడం అది కూడా టెస్ట్ క్రికెట్ లో మెరుపులు మెరిపించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆరో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. 35 ఏళ్ల టిమ్ సౌథి లోయర్ ఆర్డర్‌లో బ్యాట్ తో అరుదైన ఘనతలు సాధిస్తున్నాడు. 103 టెస్టుల్లో సౌథి 92 సిక్సర్లు సాధించాడు. ఏడో స్థానంలో ఉన్న సెహ్వాగ్ 104 టెస్టుల్లో 92 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ 131 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా… బ్రెండన్ మెక్‌కలమ్ , ఆడమ్ గిల్‌క్రిస్ట్ , క్రిస్ గేల్, జాక్వెస్ కలిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భార‌త్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టిమ్ సౌథి హాఫ్ సెంచరీ సాధించాడు. .