India, England : ఇంగ్లాండ్ తో సెమీఫైనల్.. ఆ ముగ్గురితోనే డేంజర్

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం రాత్రి భారత్, ఇంగ్లాండ్ సెమీస్ లో తలపడబోతున్నాయి. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2024 | 01:31 PMLast Updated on: Jun 27, 2024 | 1:31 PM

Semi Final With England Those Three Are Dangerous

 

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం రాత్రి భారత్, ఇంగ్లాండ్ సెమీస్ లో తలపడబోతున్నాయి. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. స్టార్ ప్లేయర్స్ తో కూడిన రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గత ఎడిషన్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ రివేంజ్ కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇంగ్లాండ్ గతం కంటే బలంగా ఉంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ళతో భారత్ కు ప్రమాదముంది. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది జాస్ బట్లర్ గురించే..

ఇంగ్లాండ్ మ్యాచ్ విన్నర్ గా బట్లర్ పేరే ముందు చెబుతారు. ఈ వరల్డ్ కప్ లో 7 మ్యాచ్ లలో 191 రన్సే చేసినా దూకుడుగా ఆడుతున్నాడు. అతని అనుభవం, బ్యాటింగ్ స్టైల్ ఖచ్చితంగా ఇంగ్లాండ్ కు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. పైగా కీలక మ్యాచ్ లలో బట్లర్ ఫామ్ అందుకుంటాడన్న రికార్డుంది. అందుకే బట్లర్ ను త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లాండ్ ను దెబ్బతీసినట్టే.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో మరో డేంజరస్ ప్లేయర్ ఫిల్ సాల్ట్. ఐపీఎల్ సత్తా చాటిన సాల్ట్ ప్రస్తుత ప్రపంచకప్ లోనూ రాణిస్తున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లోనే 87 పరుగులు బాదేశాడు. భారత్ తో సెమీస్ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ టాపార్డర్ లో సాల్ట్ కీలకమనడంలో ఎటువంటి డౌట్ లేదు.

ఇక బౌలింగ్ లో ఇంగ్లాండ్ ప్రధానాస్త్రం జోఫ్రా ఆర్చర్… ఇంగ్లీష్ పేట్ ఎటాక్ ను లీడ్ చేసే ఆర్చర్ పవర్ ప్లేలో ప్రత్యర్థి జట్లు వికెట్లు తీయడంలో కీలకంగా ఉంటున్నాడు. పిచ్ సహకరించి అతను ఆరంభంలోనే చెలరేగితే భారత్ కు ఇబ్బందులు తప్పవు. ఈ ముగ్గురితోనే టీమిండియాకు ముప్పు పొంచి ఉందని విశ్లేషకుల అంచనా. అందుకే వీరిఫై ప్రత్యేక వ్యూహాలతో రోహిత్ సేన బరిలోకి దిగాలని మాజీలు సైతం సూచిస్తున్నారు.