Smita Sabharwal: సెక్రటేరియట్‌కు వచ్చిన స్మిత.. సీతక్కతో భేటీ..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ కనిపించని ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ సెక్రటేరియట్‌కు వచ్చారు. నేరుగా మంత్రి సీతక్కను కలిశారు. మంత్రితో సంతకాలు చేయించి.. ఆ కార్యక్రమం పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నారు.

Smita Sabharwal: తెలంగాణ కొత్త మంత్రులంతా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో ఎవరి గదులను వాళ్లకు కేటాయించారు అధికారులు. తమకు కేటాయించని ఛాంబర్లలో మంత్రులంతా బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ కనిపించని ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ సెక్రటేరియట్‌కు వచ్చారు. నేరుగా మంత్రి సీతక్కను కలిశారు. మంత్రితో సంతకాలు చేయించి.. ఆ కార్యక్రమం పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నారు.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
దీంతో వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల నుంచి స్మిత సబర్వాల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె డెప్యుటేషన్‌లో ఢిల్లీ వెళ్తున్నారంటూ టాక్ నడిచింది. అంతే కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన స్మిత సబర్వాల్‌పై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి, మంత్రుల అండతో ఆమె అవినీతికి పాల్పడ్డారు అనేది అంతా చెప్తున్న మాట. దీనికి తోడు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్మిత ఇప్పటి వరకూ సెక్రటేరియట్‌కు రాలేదు. కొత్త ముఖ్యమంత్రిని కలవలేదు.
సీఎంవోలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్.. కనీసం కొత్త సీఎంను కలవడానికి రాకపోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఒక్కసారిగా సెక్రటేరియట్‌లో స్మిత కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సీతక్కతో క్లోజ్‌గా కనిపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతా అంటున్నట్టు స్మిత ట్రాన్స్‌ఫర్‌లో వెళ్లిపోతారా.. లేక తెలంగాణలోనే తన డ్యూటీ కంటిన్యూ చేస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.