టీ20 క్రికెట్ లో సంచలనం, చివరి ఓవర్లో 30 రన్స్
టీ ట్వంటీ క్రికెట్ అంటేనే అనూహ్య ఫలితాలకు కేరాఫ్ అడ్రస్... గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న జట్టు గెలవొచ్చు.. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి సంచలనమే చోటు చేసుకుంది.
టీ ట్వంటీ క్రికెట్ అంటేనే అనూహ్య ఫలితాలకు కేరాఫ్ అడ్రస్… గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న జట్టు గెలవొచ్చు.. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి సంచలనమే చోటు చేసుకుంది. ఫార్చ్యూన్ బరిషల్ తో జరిగిన మ్యాచ్ లో రంగపూర్ రైడర్స్ సంచలన ఛేజింగ్ తో అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్ లో రంగపూర్ రైడర్స్ విజయానికి 26 పరుగులు కావాల్సి ఉండగా.. కెప్టెన్ నురుల్ హసన్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కైల్ మేయర్స్ వేసిన ఈ ఓవర్ లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. తొలి బంతికి సిక్సర్ కొట్టిన అతను.. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదాడు. చివరి మూడు బంతుల్లో సమీకరణం 3 బంతుల్లో సిక్సర్, ఫోర్, సిక్సర్ కొట్టాడు. దీంతో రైడర్స్ సంచల విజయాన్ని అందుకుంది.