డ్రగ్స్ తీసుకుంటున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అతనికి నార్కోటిక్ పరీక్షలు చేయించాలి అని డిమాండ్ చేసారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజలను రెచ్చొట్టడం కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అని మండిపడ్డారు.
అతన్ని సాంఘిక బహిష్కరణ చేయాలి అని కోరారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే లను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు సిగ్గు శరం లేవా అని నిలదీశారు. మేం తిరిగి మీలా చేయాలనుకుంటే ఊల్లలో తిరగలేరు జాగ్రత్త అని హెచ్చరించారు. గాజులు, చీరలు చూపడం కాదు కట్టుకొని తిరగండి అంటూ ఎద్దేవా చేసారు.