Serial Actor Pavitra : పవిత్ర యాక్సిడెంట్ కేసులో సంచలన విషయాలు
సినీ ఇండస్ట్రీ ఓ మంచి యాక్టర్ (Actor) ను కోల్పోయింది. త్రినయని సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న పవిత్ర (Pavitra)జయరాం రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. తన ప్రియుడు చంద్రకాంత్‌తో కలిసి కర్నాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిన పవిత్ర.. హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది.

Sensational matters in the sacred accident case
సినీ ఇండస్ట్రీ ఓ మంచి యాక్టర్ (Actor) ను కోల్పోయింది. త్రినయని సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న పవిత్ర (Pavitra)జయరాం రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. తన ప్రియుడు చంద్రకాంత్‌తో కలిసి కర్నాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిన పవిత్ర.. హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా శెరిపల్లిలోని నేషనల్ హైవే (National Highway) పై వస్తుండగా పవిత్ర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న బస్ కారును ఢీ కొట్టడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో పవిత్ర ప్రియుడు చంద్రశేఖర్ ఆమె బంధువు ఆపేక్ష కారు డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కానీ పవిత్ర మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. త్రినయని సీరియల్‌తో పాపులారిటి సంపాదించుకున్నారు పవిత్ర ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తిలోత్తమగా నెగిటివ్ షేడ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. కర్నాటకలోని మాండ్యకు చెందిన పవిత్ర కన్నడలో చాలా సీరియల్స్‌లో నటించారు. జోకలి అనే సీరియల్‍తో నటిగా మారిన ఆమె రోబో ఫ్యామిలీ, విద్యావినాయక, గాలిపటా, రాధారామన్ వంటి పలు సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్లడతా సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చారు.
తెలుగులో చేసింది కొన్ని పాత్రలే అయినా ప్రతీ పాత్రలో జీవిచడం ఆమెకున్న బలం. ఆ కారణంగా మంచి సీరియల్స్‌లో నటించే అవకాశం పవిత్రకు లభించింది. ప్రస్తుతం జీ తెలుగులో త్రినయని అనే సీరియల్‌లో పవిత్ర నటిస్తున్నారు. ముందు చేసిన అన్ని సీరియల్స్ కంటే త్రినయని సీరియల్‌తో పవిత్రకు మంచి పేరు వచ్చింది. ఇక జీ తెలుగు యాజమాన్యం కూడా పవిత్రకు నివాళులర్పించింది. పవిత్ర జయరాం మృతి జీ కుటుంబానికి తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు” అంటూ పోస్ట్ చేసింది జీ తెలుగు.