Chandu sucide : సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య..
టాలీవుడ్ (Tollywood) బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Serial actor Chandrakant committed suicide.
టాలీవుడ్ (Tollywood) బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి కాలనీలోని తన నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర జయరామ్ (Pavitra Jayaram) చనిపోయిన సరిగ్గా ఐదు రోజులకే చందు కూడా తన నివాసంలో సూసైడ్ చేసుకోవటం అందరిని షాక్‌కు గురి చేసింది. కాగా, చందు తెలుగులో త్రినయని, కార్తీక్ దీపం(Karthik Deepam), రాధమ్మ కూతురు వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు.
అయితే, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని (Trinayani) సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో చందుకు ఆరేళ్లుగా దగ్గర అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే.. పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు.. తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి డిప్రేషన్‌లోకి వెళ్లిన చందు.. ఆమె ఎడబాటును తట్టుకోలేక కుమిలిపోతున్నాడు.ఈ నేపథ్యంలోనే చందు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ‘ఆమె నన్ను పిలుస్తున్నది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు
కాగా, చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. యాక్టర్ చందు మరణవార్త తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చందు ఆకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణమేంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు చందు మరణవార్తతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.