HEAT WAVES IN AP: ఏపీకి అలర్ట్.. రెండు రోజులు తీవ్ర వడగాల్పులు
రాష్ట్రంలోని 154 మండలాల్లో ఈ వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఏపీలో ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో నిప్పులు కొలిమిలా వాతావరణం ఉంటోంది.
HEAT WAVES IN AP: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. అనేక ప్రాంతాల్లో ఎండతోపాటు వడగాల్పులు కూడా ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఏపీకి విపత్తు నిర్వహణ సంస్థ కీలక అలర్ట్ జారీ చేసింది. ఏపీలో రాబోయే రెండు రోజులపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 154 మండలాల్లో ఈ వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
YS JAGAN: ముగిసిన సిద్ధం యాత్ర.. జగన్ కన్నీటి లేఖ..
ప్రస్తుతం ఏపీలో ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో నిప్పులు కొలిమిలా వాతావరణం ఉంటోంది. ఇప్పటికే ఉక్కపోత, వేడి గాల్పులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ చివరి వారంలోనే ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులుంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన హెచ్చరికల్ని ప్రజలు గుర్తించాలి. గురువారం ఏపీలోని 54 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 36 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 157 మండలాల్లో వడగాల్పులలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. టోపీ ధరించడం, తగినన్ని నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అంశంపై వైద్యాధికారులకు కూడా కీలక సూచనలు చేశారు. అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు.