Prajwal Revanna : అబ్బాయిపై లైంగిక దాడి! ప్రజ్వల్ రేవణ్ణ బ్రదర్ సూరజ్ అరెస్ట్
కర్నాటక స్టేట్‌లో ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూ ఏ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం.

Sexual assault on the boy! Prajwal Revanna's brother Suraj was arrested
కర్నాటక స్టేట్‌లో ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూ ఏ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌తో ఈ వ్యవహారం కాస్త సర్దుమనిగింది అనుకునేలోపే.. జేడీఎస్‌కు మరో షాక్ తగిలింది. ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్‌ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ హైలెట్ ఏంటి అంటే.. కేసు పెట్టింది అమ్మాయి కాదు.. అబ్బాయి. అవును.. సూరత్ తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడంటే చేతన్ అనే పార్టీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో సూరజ్ సూరజ్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో సూరజ్ తనను చూశాడని అప్పటి నుంచి రెగ్యులర్‌గా పార్టీ ఆఫీసుకు పిలిపించుకునేవాడని చేతన్ పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు మాట్లాడే పని ఉందని పిలిచి తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. ఐతే ఈ కేసులో సూరజ్ చెప్తున్న వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. చేతన్ తనను డబ్బులు డిమాండ్ చేశాడని.. ఆ డబ్బులు ఇవ్వని కారణంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్తున్నాడు. మరో పక్క సూరజ్ అనుచరుడు శివకుమార్ కూడా చేతన్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం ఓ ఉద్యోగం విషయంలో చేతన్ తనను కలిశాడని.. అప్పుడు తానే సూరజ్ నెంబర్ ఇచ్చి సూరజ్ దగ్గరికి పంపించానని చెప్పాడు.
ఆ ఉద్యోగం రాకపోవడంతో చేతన్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టాడని చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు ఏంటి అన్న విషయం పక్కన పెడితే.. రీసెంట్‌గానే లైంగిక వేధింపుల కేసులు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యాడు. ఇదే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అనుకుంటే ఇప్పుడు సూరజ్ రేవణ్ణ కూడా అరెస్ట్ అవ్వడం.. అది కూడా అబ్బాయి మీద లైంగిక దాడి కేసులో అరెస్ట్ అవ్వడం పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది.