Anant Radhika Wedding : షారుఖ్ 40, అమితాబ్ 30కోట్లు.. దీపికా 20 కోట్ల కారు గిఫ్ట్.. అనంత్, రాధికాకు కళ్లు చెదిరే బహుమతులు..
అనంత్ (Anant), రాధికా పెళ్లి(Radhika Wedding) క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు. నభూతో అనే రేజ్‌లో అనంత్, రాధికా పెళ్లి జరిగింది.

Shah Rukh 40 crores, Amitabh 30 crores.. Deepika 20 crores car gift.. Anant and Radhika eye-catching gifts..
అనంత్ (Anant), రాధికా పెళ్లి(Radhika Wedding) క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు. నభూతో అనే రేజ్‌లో అనంత్, రాధికా పెళ్లి జరిగింది. చరిత్రలో నిలిచిపోయేలా.. చరిత్ర గుర్తుంచుకునేలా.. అనంత్ అంబానీ పెళ్లి కోట్లలో ఖర్చు పెట్టి జరిపించారు. వీరి వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు (Movie Celebrities) హాజరై సందడి చేశారు. టాలీవుడ్ (Tollywood), బాలీవుడ్ (Bollywood) నటీనటులు హాజరై.. అట్రాక్షన్‌గా నిలిచారు. అనంత్ అంబానీ, రాధిక పెళ్లై వారం దాటుతోన్నా.. సోషల్ మీడియాలో వీరి ఫొటోలు ఇంకా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే అనంత్ అంబానీ, రాధికకు ఎవరెవరు ఏం గిఫ్ట్స్, ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చారంటూ ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అభిషేక్ (Abhishek), ఐశ్వర్య కలిసి.. కొత్త జంటకు 30కోట్ల విలువ చేసే నెక్‌పీస్ గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇక కింగ్ ఖాన్ షారుఖ్.. అనంత్, రాధికా దంపతులకు 40కోట్ల విలువ చేసే విల్లా గిఫ్ట్‌గా ఇచ్చాడు. రణవీర్, దీపికా కలిసి 20కోట్ల రోల్స్ రాయిస్ కారు… సల్మాన్ ఖాన్ 15 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ బైక్.. రణబీర్ , అలియా కలిసి 9 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు.. బిల్ గేట్స్ 9కోట్ల వజ్రం, జాన్ సెనా 3కోట్ల లాంబర్గినీ కారు..
ఇక అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 11కోట్ల విలువ చేసే బుగాటీ కారు… అక్షయ్ కుమార్ 60లక్షల బంగారు పెన్ను… విక్కీ కౌశల్, కత్రినా కలిసి 19 లక్షల విలువ చేసే గోల్డ్ చెయిన్.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా కలిసి హ్యాండ్‌మేడ్ శాలువ, చిన్న గోల్డ్ చెయిన్, వాచ్, బ్లేజర్లు, కార్లు, రింగ్స్, బ్రేస్లెట్లు ఇచ్చారట. దాదాపు నాలుగు కేజీల గోల్డ్ వస్తువులు గిఫ్ట్స్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తల్లిదండ్రులు నీతా, ముఖేష్ అంబానీ కూడా… పామ్ జుమేరాలో 3 వేల చదరపు అడుగుల ఓ ఇల్లును గిఫ్ట్స్ గా ఇచ్చారట. దీని ధర వందల కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. రాధికకు 130 కోట్ల రూపాయల విలువ గల నగలు ఇచ్చారట.