Sharuk Khan: హిట్ వచ్చిన వేళ.. చేదు వార్త..
షారూఖ్ ఖాన్ కి కొడుకు ఆర్యన్ ఖాన్ తెచ్చిన తిప్పలు మామూలుగాలేవు.

Shah Rukh Khan is facing drug problems from his son Aryan Khan
బాలీవుడ్ షారుఖ్ ఖాన్ పటాన్ కి ముందు 5 ఏళ్లు సినిమాలు చేయలేదు. కారణం ఒకటి కరోనా కష్టాలు, అలానే కొడుకు మీద పడ్డ డ్రగ్స్ కేసు. అతి కష్టం మీద డ్రగ్స్ కేసులోంచి కొడుకు బయట పడ్డాడనుకున్న టైంలోనే పటాన్ లాంటి హిట్ వచ్చింది. ఇప్పుడ జవాన్ తో మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. ఇలా అంతా సవ్యంగా సాగుతోంది. కింగ్ ఖాన్ మంచి ఖుషీలో ఉన్నాడనుకున్న వేళ పిడుగులాంటి వార్త వచ్చింది. షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేస్ ని డీల్ చేసిన సమీర్ వాంఖడే కి క్లీన్ చీట్ వచ్చింది.
నిజానికి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు హ్యాండిల్ చేస్తున్న సమీర్ వాంఖడే కావాలని షారుక్ కొడుక మీద డ్రగ్స్ కేస్ వేశాడన్నారు. 25 కోట్లు కింగ్ ఖాన్ నుంచి డిమాండ్ చేశాడని కూడా ఈ పోలీస్ ఆఫీసర్ మీద అభియోగాలు వేశారు. దీంతో సమీర్ వాంఖడే ని విధుల నుంచి తీసేసి, ఈ ఆఫీసర్ మీద కేస్ ఫైట్ చేసి ఎంక్వైరీ చేశారు.
విచారణలో అసలు సమీర్ వాంఖడే నిజానికి షారుఖ్ నుంచి ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదని, తన మీదవచ్చినవన్నీ తప్పుడు ఆరోపనలే అని ప్రత్యేక కమిటీ తేల్చింది. అంటే ఇక్కడ సమీర్ వాంఖడే మంచి వాడే అయితే, ఇప్పడు షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ నిజంగా ముద్దాయా? ఇలాంటి డౌట్లే వస్తాయి.. తన మీద తప్పుడు ఆరోపనలతో కావలనీ పక్కకు తప్పించటంతో కోపం తో రగిలిపోయే ఆ పోలీస్ ఆఫీసర్ సమీర్ వాంఖడే ఊరుకుంటాడా? అసలు ఆట ఇక మొదలు అంటూ, షారుఖ్ ని వ్యతిరేకించేయాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెంచారు. పండగ చేసుకుంటున్నారు.