Shakeel : దుబాయ్ నుంచే షకీల్ బేరసారాలు.. సోహెల్ కేసులో సంచలన నిజాలు
కొడుకును యాక్సిడెంట్ కేసు నుంచి రక్షించడానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచే బేరసారాలు నడిపినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 24 నాడు అర్థరాత్రి టైమ్ లో షకీల్ కొడుకు సోహెల్ అమీర్ తప్పతాగి కారు నడుపుతూ.. ప్రజాభవన్ బ్యారికేడ్స్ ఢీకొట్టాడు. తర్వాత పోలీసులను మేనేజ్ చేసి.. తన తండ్రి అప్పటికే దుబాయ్ లో ఉండటంతో అక్కడి పరారయ్యాడు.
కొడుకును యాక్సిడెంట్ కేసు నుంచి రక్షించడానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచే బేరసారాలు నడిపినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 24 నాడు అర్థరాత్రి టైమ్ లో షకీల్ కొడుకు సోహెల్ అమీర్ తప్పతాగి కారు నడుపుతూ.. ప్రజాభవన్ బ్యారికేడ్స్ ఢీకొట్టాడు. తర్వాత పోలీసులను మేనేజ్ చేసి.. తన తండ్రి అప్పటికే దుబాయ్ లో ఉండటంతో అక్కడి పరారయ్యాడు. అయితే పంజాగుట్ట మాజీ ఇన్స్ పెక్టర్ దుర్గారావుతో షకీల్ అక్కడి నుంచే మంతనాలు చేసినట్టు ఫోన్ సంభాషణలు బయటపడ్డాయి. దాంతో ఈ కేసులో సహ నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పోలీసులు చేరుస్తున్నారు.
డిసెంబర్ 24నాడు అర్థరాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కారు యాక్సిడెంట్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆ ప్రమాదం జరిగినప్పుడు సోహెల్ నే BMW కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. మరో ముగ్గురు కూడా అందులో ఉన్నారు. పంజాగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. సోహెల్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తీసుకొచ్చారు. అప్పుడు ఇన్స్ పెక్టర్ దుర్గారావు డ్యూటీలో ఉన్నారు. పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ఇద్దరు వెంటనే పంజాగుట్ట పీఎస్ కు చేరుకొని అప్పటి ఇన్స్ పెక్టర్ దుర్గారావుతో మంతనాలు జరిపారు. దుబాయ్ లో ఉన్న షకీల్ కు కాల్ చేసి.. ఇన్స్ పెక్టర్ తో మాట్లాడించారు. సోహెల్ ను విడిచిపెట్టేందుకు లక్షల్లో బేరం కుదరగానే… బ్రీత్ ఎనలైజర్ పేరుతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళగా.. అక్కడి నుంచి నిందితుడు తప్పించుకొని నేరుగా దుబాయ్ వెళ్ళిపోయాడు. అతని మొబైల్ కూడా పోలీసులు తిరిగి ఇచ్చేశారు. దాంతో దుబాయ్ లోనే ఉన్న తండ్రి షకీల్ దగ్గరకు వెళ్ళిపోయాడు సోహెల్.
ఇప్పటికే సోహెల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఫోన్ లో మాట్లాడి.. పోలీసులను ఇన్ ఫ్లుయెన్స్ చేసినందుకు .. ఈ కేసులో కొడుకుతో పాటు తండ్రి షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు సోహెల్, షకీల్ ఇద్దర్నీ దుబాయ్ నుంచి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. సోహెల్ పై పోలీసులు ర్యాష్ డ్రైవింగ్, రోడ్ డివైడర్స్ ఢీకొట్టడం కేసులు నమోదు చేశారు. ఇదే సందర్భంలో 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఓ చిన్నారి మరణానికి కారణమైన కేసును కూడా రీఓపెన్ చేస్తున్నారు. అప్పుడు కూడా సోహెల్ నే డ్రైవింగ్ చేశాడనీ ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పట్లో షకీల్ బోధన్ BRS ఎమ్మెల్యేగా ఉన్నాడు. అధికారపార్టీ అండతో జూభ్లీహిల్స్ పోలీసులు సొహైల్ ను తప్పించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో అతినికి బదులుగా మరొకరిని కోర్టుకు పంపి.. కేసును క్లోజ్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని కూడా పోలీసులు తిరగదోడుతున్నారు. మరో 2,3 రోజుల్లో దుబాయ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ పైనా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.