బ్యాట్ తో ఇరగదీసిన షమీ,ఛండీఘర్ పై మెరుపు ఇన్నింగ్స్
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బౌలర్ గానే అభిమానులకు తెలుసు.. కానీ అతనిలో మంచి బ్యాటర్ కూడా ఉన్నాడు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బౌలర్ గానే అభిమానులకు తెలుసు.. కానీ అతనిలో మంచి బ్యాటర్ కూడా ఉన్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మీ బ్యాట్ తో ఇరగదీశాడు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సీనియర్ పేసర్ చంఢీఘర్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కులు చూపించాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షమీ.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. షమీ బ్యాటింగ్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. షమీ మెరుపు ఇన్నింగ్స్ తో బెంగాల్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.