షమి ఫిట్‌నెస్ ఓ మిస్టరీ, బీసీసీఐ దాచిపెడుతోందా ?
ఓ ఆటగాడు గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తేనే జాతీయ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడు... ఆటగాళ్ళ కెరీర్ లో గాయాలనేవి కామనే... ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇవి తరచుగా ఎదురవుతూనే ఉంటాయి... కానీ బీసీసీఐ లాంటి రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో అత్యుత్తమ సదుపాయాలతో ఎన్సీఎ నడుపుతోంది.
ఓ ఆటగాడు గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తేనే జాతీయ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడు… ఆటగాళ్ళ కెరీర్ లో గాయాలనేవి కామనే… ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇవి తరచుగా ఎదురవుతూనే ఉంటాయి… కానీ బీసీసీఐ లాంటి రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో అత్యుత్తమ సదుపాయాలతో ఎన్సీఎ నడుపుతోంది. ఇక్కడకు వచ్చే ప్రతీ ప్లేయర్ దాదాపు మంచి ఫిట్ నెస్ సాధిస్తూ టీమిండియాకు ఎంపికవుతుంటారు. కానీ సీనియర్ పేసర్ మహ్మద్ షమి విషయంలో మాత్రం ఫిట్ నెస్ అనేది ఓ మిస్టరీగా మారిపోయింది. గాయం నుంచి కోలుకున్నాడంటారు… ఫిట్ నెస్ బాగుందంటారు.. దేశవాళీ టోర్నీలు ఆడిస్తారు… కానీ జాతీయ జట్టులోకి ఎంపిక చేయడమే మిగిలిందన్న వేళ మళ్ళీ ఫిట్ నెస్ సమస్యలు తలెత్తాయంటూ బోర్డు చెబుతుండడంతో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆటగాడి ఫిట్ నెస్ 100 శాతం ఉందో లేదో తెలుసుకోలేని స్థితిలో మన నేషనల్ క్రికెట్ అకాడమీ ఉందా అనేది ఇక్కడ మొదటి ప్రశ్న… అలాగే షమి ఫిట్ నెస్ విషయంలో బీసీసీఐ ఏదో దాస్తుందన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
నిజానికి వన్డే ప్రపంచకప్ తర్వాత షమి గాయంతో గ్రౌండ్ కు దూరమయ్యాడు. తర్వాత సర్జరీ చేయించుకుని ఫిట్ నెస్ కోసం బాగానే శ్రమించాడు. అతని ఫిట్ నెస్ విషయంలో ఒకసారి రోహిత్ శర్మ సైతం సరైన కమ్యూనికేషన్ లేకుండా మాట్లాడాడన్న విమర్శలూ ఉన్నాయి. గబ్బా టెస్టు ముగిసిన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ శర్మను షమి గురించి ప్రశ్నించగా.. నేషనల్ క్రికెట్ అకాడెమీయే అప్డేట్ ఇవ్వాలని అతడు అన్నాడు. మొత్తానికి బీసీసీఐ షమి గాయం గురించి వెల్లడించింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన సమయంలో బౌలింగ్ భారం పెరిగి అతని ఎడమ మోకాలులో వాపు కనిపించినట్లు బోర్డు తెలిపింది. ఇప్పుడు ఏడాదికిపైగా జట్టుకు దూరంగా ఉన్న షమి.. ఆస్ట్రేలియా వెళ్లడం లేదు.అతని మోకాలులో వాపు రావడంతోనే ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండబోడని బోర్డు స్పష్టం చేసింది.
షమి పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. అతడు ఎలా కోలుకుంటాడన్నదానిపైనే విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలుస్తుందని కూడా చెప్పింది. టెస్టులకు సరిపడా ఫిట్‌నెస్ సాధించేలా బీసీసీఐ మెడికల్ సిబ్బంది అతనితో కలిసి పని చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. నిజానికి గతంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ.. షమి మోకాలిలో వచ్చిన వాపు గురించి తెలిపాడు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడుతున్న విషయం తనకు తెలుసని, అయితే అతని రికవరీపై మాత్రం అనిశ్చితి కొనసాగుతోందని అన్నాడు. మహ్మద్ షమి గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత మళ్లీ టీమిండియాకు ఆడలేదు.