K KAVITHA: అప్రూవర్‌గా మారిన శరత్‌ చంద్రారెడ్డి.. కవిత చాప్టర్‌ ఇక క్లోజేనా..?

సెక్షన్‌ 164 కింద ఢిల్లీ రైజ్‌ ఎవెన్యూ కోర్టులో శరత్‌ రెడ్డి జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇదే స్కాంకు సంబంధించ ఈడీ నమోదు చేసిన కేసులో కూడా శరత్‌ రెడ్డి అప్రూవర్‌గా మారాడు. స్కాంలో జరిగిన మొత్తం విషయాన్ని ఒప్పుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2024 | 07:43 PMLast Updated on: Apr 20, 2024 | 7:48 PM

Sharath Chandra Reddy Became Approver Against K Kavitha In Liquor Scam

K KAVITHA: కేసీఆర్‌ కుటుంబాన్ని షేక్‌ చేసిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారాడు. సెక్షన్‌ 164 కింద ఢిల్లీ రైజ్‌ ఎవెన్యూ కోర్టులో శరత్‌ రెడ్డి జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇదే స్కాంకు సంబంధించ ఈడీ నమోదు చేసిన కేసులో కూడా శరత్‌ రెడ్డి అప్రూవర్‌గా మారాడు. స్కాంలో జరిగిన మొత్తం విషయాన్ని ఒప్పుకున్నాడు.

YS JAGAN-YS SHARMILA: జగన్‌ దగ్గర రూ.100 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల.. ఇదే ఇద్దరినీ విడదీసిందా..?

ఇప్పుడు సీబీఐ నమోదు చేసిన కేసులో కూడా అదే రిపీట్‌ అయ్యింది. శరత్‌చంద్రారెడ్డి ఇచ్చిన వాగ్మూలం మేరకు సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రా రెడ్డి దక్కించుకున్న ఐదు జోన్లకు.. ఒక్కో జోన్‌కి 5 కోట్ల చొప్పున మొత్తం 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. కవిత డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చేందుకు శరత్ చంద్రా రెడ్డి నిరాకరించడంతో కవిత బెదిరించినట్లు సీబీఐ చెప్పింది. రెండు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ప్రత్యేక కోర్టు కవితను ఈనెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కి పంపింది. కవితను జ్యుడీషియల్ రిమాండ్‌కి ఇచ్చిన నాలుగు రోజుల్లోనే సీబీఐ కేసులో అప్రూవర్‌గా మారి శరత్ చంద్రా రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. దీంతో కవితకు ఈ కేసులో మరిన్ని కష్టాలు రావడం పక్కా అని తెలుస్తోంది. ఐతే లిక్కర్ స్కాం వ్యవహారంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు.

ఈకేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని.. కేవలం కొంత మంది స్టేట్ మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. మరో వైపు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ పెద్ద ఎత్తున బీజేపీకి పొలిటికల్ బాండ్స్ రూపంలో డబ్బు చెల్లించిందని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది.ఇలాంటి నేపథ్యంలో శరత్‌ చంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అటు ఆమ్‌ ఆద్మీకి ఇటు కవితక పరిస్థితి ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.