4 ఓవర్లలో 69 రన్స్ ఇచ్చేశాడు, శార్థూల్ ఠాకూర్ చెత్త రికార్డ్
ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ శార్థూల్ ఠాకూర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శార్థూల్ చెత్త ప్రదర్శన కనబరిచాడు.

ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ శార్థూల్ ఠాకూర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శార్థూల్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. దేశవాళీ ధనాధన్ టోర్నీలో చెత్త బౌలర్‌గా అపకీర్తి మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ రమేశ్ రాహుల్ సరసన రికార్డులకెక్కాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ ఏకంగా 17.25 ఎకానమీ రేటుతో 69 పరుగులు సమర్పించుకున్నాడు. సంజు శాంసన్ వికెట్ తీసినప్పటికీ శార్దూల్‌కు ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మెగాటోర్నీలో కొన్నిరోజుల ముందు రమేశ్ రాహుల్ కూడా 69 పరుగులు ఇచ్చాడు.