YS Jagan VS Sharmila : జగన్‌కు నిద్రలేకుండా చేసిన షర్మిల.. ఎన్ని ఓట్లు చీల్చిందంటే..
ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. బలం అనుకున్న ప్రతీ విషయం.. బలహీనంగా మారిందని ఈ ఫలితాలతో తెలిసొచ్చింది. కంచుకోటలాంటి రాయలసీమలోనూ.. వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగిలాయ్.

Sharmila who made Jagan sleepless.. how many votes did she split..
ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. బలం అనుకున్న ప్రతీ విషయం.. బలహీనంగా మారిందని ఈ ఫలితాలతో తెలిసొచ్చింది. కంచుకోటలాంటి రాయలసీమలోనూ.. వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగిలాయ్. పార్టీ విధానాల్లో, వ్యవహారాల్లో ఇప్పటికైనా మార్పులు చేయకపోతే.. మారకపోతే.. రాబోయే రోజుల్లో వైసీపీ మనుగడే కష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం ఉందనే చర్చ జరిగింది. నిజానికి ఈ ఎన్నికల్లో వైసీపీకి ఏ ఒక్క విషయం కూడా కలిసిరాలేదు.
వైసీపీ ఓటమిని కూటమి నేతల అభిప్రాయం ఎలా ఉందో కానీ.. ఫ్యాన్ పరాభవాన్ని జగన్ చెల్లి షర్మిల మాత్రం.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్న మీద కోపంతో ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన షర్మిల.. వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోయింది. జగన్‌తో పాటు.. మరో సోదరుడు అవినాశ్ రెడ్డిని కూడా టార్గెట్ చేసుకున్నారు షర్మిల. అవినాశ్ రెడ్డి మీద పోటీకి దిగారు కూడా ! ఇది చాలా ఇంపాక్ట్ చూపించింది. అవినాశ్ రెడ్డిని టెన్షన్ పెట్టింది. షర్మిలకు లక్షన్నరకు పైగా ఓట్లు వచ్చాయ్. ఈ ఓట్లన్నీ వైసీపీ నుంచి చీల్చినవే ! ఇక్కడే కాదు.. పులివెందులలోనూ షర్మిల ఎఫెక్ట్ కనిపించింది. వైఎస్‌కు నిజమైన వారసురాలిని తనే అంటూ షర్మిల చేసిన ప్రచారానికి… పులివెందుల ఓటర్లు కదిలిపోయినట్లు కనిపించారు. జగన్ మెజారిటీ భారీగా తగ్గడమే దీనికి సాక్ష్యం. గత ఎన్నికల్లో 91వేలకు పైగా మెజారిటీలో అసెంబ్లీలో అడుగు పెట్టిన జగన్..
ఈసారి మాత్రం 60వేల మెజారిటీకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నంబర్ తగ్గడంలో షర్మిల పాత్రే కీ రోల్ ప్లే చేసింది. దీనికితోడు షర్మిలను గెలిపించాలి అంటూ ఎన్నికలకు ముందు రోజు విజయమ్మ విడుదల చేసిన వీడియో కూడా.. ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఓవరాల్‌గా.. జగన్‌కు, అవినాశ్ రెడ్డికి టెన్షన్ పరిచయం చేసి. నిద్రలేని రాత్రులను షర్మిల మిగిల్చారు అనే చర్చ జరుగుతోంది. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు.. వైసీపీ నుంచి ఘాటు విమర్శలు వినిపించాయ్. అసలు షర్మిల వైఎస్ కూతురే కాదంటూ కొందరు వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా ! చంద్రబాబుకు ఆమె మౌత్‌పీస్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పిచారు. ఐతే షర్మిల మాత్రం తన పవర్ ఏంటో ఈ ఎన్నికల్లో చూపించారు.