Shekar Master: శేఖర్ మాస్టర్‌తో రాకేశ్ మాస్టర్‌కు ఎక్కడ చెడింది.. ? తన శవాన్ని కూడా తాకొద్దని ఎందుకన్నాడు?
రాకేశ్ మాస్టర్ మరణంతో.. టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయ్. నిన్నటివరకు ఆనందంగా, అల్లరిచిల్లరిగా కనిపించిన రాకేశ్ మాస్టర్.. ఇక లేరు, రారు అని తెలిసి.. ఆయన అభిమానులు, డ్యాన్సర్లు, నెటిజన్లు బాధలో మునిగి పోయారు.

Shekhar Master came to see the physical body of famous choreographer Rakesh Master
రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయ్. కన్నీళ్లతో తన గురువుకు తుది వీడ్కోలు పలికారు శేఖర్ మాస్టర్. ఏడుస్తూ రాకేశ్ మాస్టర్ డెడ్‌బాడీ దగ్గరకు వచ్చిన శేఖర్‌ను చూసి ప్రతీ ఒక్కరి మనసు కరిగిపోయింది. శేఖర్‌తో పాటు గణేష్, సత్య, జానీ.. వీళ్లంతా రాకేశ్ మాస్టర్ శిష్యులే ! మిగతా వాళ్లతో ఎలా ఉన్నా.. శేఖర్ మాస్టర్‌తో రాకేశ్ మాస్టర్‌కు దూరం పెరిగింది. తను చనిపోతే తన శవాన్ని కూడా శేఖర్ చూడటానికి వీల్లేదంటూ ఓ ఇంటర్వ్యూలో రాకేశ్ మాస్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. దీంతో అసలు గురుశిష్యులకు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ చెడింది.. ఇంత దూరం ఎందుకు పెరిగిందనే చర్చ చాలామందిలో వినిపిస్తోంది.
రెండు పూటలా తినడానికి లేని పరిస్థితుల్లో శేఖర్‌ను తాను చేరదీశానని.. అలాంటిది తన గురించి శేఖర్ మాస్టర్ తక్కువ చేసి మాట్లాడాడు అన్నది రాకేశ్ మాస్టర్ కోపం. కన్నబిడ్డలా చూసి పెళ్లి చేస్తే తర్వాత తనను పక్కన పెట్టాడని చాలాసార్లు బాధపడ్డాడు. శేఖర్ కూతురి పుట్టిన రోజుకి కూడా తనకు చెప్పలేదని… శేఖర్ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని, తను చనిపోతే వాడు తన శవాన్ని కూడా తాకడానికి వీల్లేదని అన్నాడు. ఐతే రాకేశ్ మాస్టర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. ఓ రోజు తాగి తన తల్లిని తిట్టాడని.. బాధ అనిపించి అప్పటి నుంచి ఆయనతో మాట్లాడం మానేశానని శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడు. వీటితో పాటు ఇద్దరిలో తప్పు ఎవరిది అయినా.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు రాకేశ్ మాస్టర్ ప్రాణాలతో లేరు. గురువు భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన శేఖర్‌ను చూపి ఇప్పుడు చాలామంది కన్నీరు పెడుతున్నారు.